Monkey Pox: విదేశాల నుంచి ఎంట్రీ, కేరళలో మంకీ పాక్స్ కలకలం, అలర్ట్ అయ్యాము, మంత్రి వీణా జార్జ్ !
కొచ్చి/తిరువనంతపురం: కరోనా వైరస్ మహమ్మారి తరువాత ప్రపంచంలో కొత్త వైరస్ లు పుట్టుకొస్తున్నాయి. కరోనా వైరస్ దెబ్బతో ప్రపంచ దేశాల ప్రజలు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. చైనా పుణ్యమా అంటూ ప్రపంచ దేశాలకు కరోనా వైరస్ పరిచయం అయ్యింది. కరోనా వైరస్ దెబ్బతో కోటీశ్వరులతో పాటు సామాన్య ప్రజల జీవితాలు తల్లకిందులు అయ్యాయి.
కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్నామని అనుకుంటున్న ప్రజలు ఇప్పుడు మంకీ పాక్స్ వైరస్ భయం పట్టుకుంది. ఇదే ఏడాది మార్చి నెలలో నైజారీయాలో మంకీ పాక్స్ వ్యాధితో బాదపడుతున్న ఓ వ్యక్తి మరణించాడు. మంకీ పాక్స్ తో బాధపడుతూ చికిత్స పొందుతున్న 40 ఏళ్ల వ్యక్తి చనిపోయాడని నైజీరియా సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది.

విదేశాల నుంచి కేరళ వెళ్లిన వ్యక్తికి మంక పాక్స్ లక్షణాలు ఉండటంతో అక్కడి ప్రజలు హడలిపోయారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి మంకీ పాక్స్ లక్షణాలు కనపడ్డాయని, అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని కేరళ ఆరోగ్య శాఖా మంత్రి వీణా జార్జ్ స్థానిక మీడియాకు చెప్పారు.
విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి ఆరోగ్య పరీక్షలు చేశామని, అతని సాంపిల్స్ సేకరించి సంబంధిత ల్యాబ్ కు పంపించామని కేరళ ఆరోగ్య శాఖా మంత్రి వీణా జార్జ్ స్థానిక మీడియాకు చెప్పారు. అయితే విదేశాల నుంచి కేరళ వచ్చిన వ్యక్తి ఎవరు ? అతని పేరు, వివరాలు చెప్పడానికి కేరళ ఆరోగ్య శాఖా మంత్రి వీణా జార్జ్ నిరాకరించారని స్థానిక మీడియా తెలిపింది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఆ వ్యక్తి బయటకు రాకుండా మెరుగైన చికిత్స అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేరళ ఆరోగ్య శాఖా మంత్రి వీణా జార్జ్ స్థానిక మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications