దర్జాగా వచ్చింది.. డబ్బులు ఎత్తుకెళ్లింది.. ఇదెక్కడి కోతిరా నాయనా..! (వీడియో)
కాన్పూర్ : ఉత్తరప్రదేశ్ లో ఓ కోతి హల్ చల్ చేసింది. కాన్పూర్ టోల్ ప్లాజా క్యాష్ కౌంటర్ నుంచి డబ్బులు ఎత్తుకెళ్లింది. వినడానికి విడ్డూరంగా ఉన్నా.. ఇది నిజం. ఏప్రిల్ 25వ తేదీన జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాన్పూర్ డిహత్ ఏరియాలోని బార టోల్ ప్లాజాలో ఓ క్యాషియర్ విధులు నిర్వహిస్తున్నాడు. వచ్చీపోయే వాహనాలకు ఛార్జీలు వసూలు చేస్తున్నాడు. ఆ క్రమంలో ఓ కారు వచ్చి ఆగడంతో నెంబర్ ఎంటర్ చేసే పనిలో ఉన్నాడు సదరు క్యాషియర్. ఆ సమయంలో సడెన్ గా ఓ కోతి.. ప్లాజా కౌంటర్ కిటికీ నుంచి లోనికి వచ్చింది. అతడి భుజాల మీదుగా క్యాష్ కౌంటర్ వరకు వెళ్లి 5వేల రూపాయల నగదును పట్టుకెళ్లింది. ఇలా వచ్చిన కోతి అలా క్షణాల్లో మాయమైంది.

అయితే ఇలా కోతి వచ్చి డబ్బులు తీసుకెళ్లడం ఇది రెండోసారని అంటున్నారు అక్కడి మేనేజర్. ఇదివరకు కూడా ఇలాగే కోతి వచ్చి డబ్బులు తీసుకెళ్లిందని చెబుతున్నారు. దీని వెనుక ఎవరైనా ఉన్నారేమోనని అనుమానం వ్యక్తం చేస్తూ.. దానికి ట్రైనింగ్ ఇచ్చి ఉంటారని అభిప్రాయపడ్డారు. అదలావుంటే తాజా ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపేమో ఆ కారులో ఉన్నతను మాత్రం.. ఆ కోతితో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నాడట. అయితే సీసీ టీవీ ఫుటేజ్ నిశితంగా పరిశీలిస్తే మాత్రం.. ఆ కారు అద్దాలు దించగానే అందులో నుంచి కోతి వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications