ఎంత పనిచేశావ్ కోతి.. తండ్రి నుంచి చిన్నారిని తీసుకొని, బిల్డింగ్ నుంచి పడేసిన వైనం
అడవీలో చెట్లు, చెమ తగ్గుతున్నాయని.. కోతులు జనారణ్యంలోకి వస్తున్నాయి. కనిపించిన వాటిని బలవంతంగా తీసుకెళ్తున్నాయి. అయితే కొన్ని చోట్ల విషాద ఘటనలు కూడా జరుగుతున్నాయి. అవును ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. బరేలీ గ్రామీణ ప్రాంతంలో ఓ కోతి వల్ల చిన్నారి ప్రాణం కోల్పోయింది. దీంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.
దుంకా గ్రామంలో నిర్దేశ్ ఉపాధ్యాయ్ ఉంటున్నారు. ఈయన భార్య, నాలుగు నెలల కుమారుడితో కలిసి ఇంటి టెర్రస్ పైకి వచ్చాడు. అది మూడంతస్తుల భవనం కాగా.. సరదాగా టెర్రస్ పై ఉండగా, ఇంతలో పెద్ద సంఖ్యలో కోతులు ఆ భవనం పైకి చేరుకున్నాయి. వాటిని తరిమేందుకు నిర్దేశ్ ప్రయత్నించాడు. ఆ కోతులు అతడిని చుట్టుముట్టాయి.

మెట్ల వైపు పరిగెత్తేందుకు ప్రయత్నించగా, అతడి చేతిలో ఉన్న పసికందు జారిపోయాడు. తిరిగి ఆ పసిబిడ్డను తీసుకునేంతలో ఓ కోతి ఆ చిన్నారిని దొరకబుచ్చుకుంది. ఆ పసికందును పైనుంచి కిందికి విసిరేసింది. అంతెత్తు నుంచి పడడంతో ఆ పసిబిడ్డ అక్కడిక్కడే మృతి చెందాడు. తమ బిడ్డ కళ్లెదుటే మరణించడంతో నిర్దేశ్ దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు.
వానరాలు ఇలా చేయడంతో స్థానికులు నోరెళ్లబెట్టారు. అప్పటివరకు ఆడుకున్న చిన్నారి మూగబోవడం వారిని తీవ్రంగా కలచివేసింది. ఇప్పటికీ కూడా వానరాలు ఒకటి రెండు కాక.. మందకు మంద వస్తున్నాయి. సో అలాంటి సమయంలో జాగ్రత్త తీసుకోవడం బెటర్
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications