రుతు పవనాల విస్తరణ- ఎల్లో అలర్ట్ జారీ: ఈదురుగాలలతో వర్ష బీభత్సం
చెన్నై/బెంగళూరు: కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతు పవనాలు క్రమంగా విస్తరిస్తోన్నాయి. దీని ఫలితంగా- కర్ణాటక, తమిళనాడుల్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. మెజారిటీ ప్రాంతాల్లో ఇంకా ఎండ తీవ్రత కొనసాగుతున్నప్పటికీ- రుతు పవనాలు విస్తరించే కొద్దీ వాతావరణంలో చల్లగా మారుతుందని ఐఎండీ తెలిపింది.
నైరుతి రుతుపవనాలు ఇప్పటికే కేరళ తీరాన్ని తాకిన విషయం తెలిసిందే. దీని ప్రభావంతో రాజధాని తిరువనంతపురం సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే అయిదు రోజుల పాటు వర్షాల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఎనిమిది జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిస్తాయని పేర్కంది. ఈ మేరకు ఆ ఎనిమిది జిల్లాలకూ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.

తిరువనంతపురం, కొల్లం, పథనంథిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, కోజికోడ్, కన్నూర్ జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇవ్వాళ్టి నుంచి వచ్చే 48 గంటల పాటు అంటే సోమవారం వరకూ పథనంథిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కిల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ స్పష్టం చేసింది. ప్రజలు ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాలని సూచించింది.

కర్ణాటక, తమిళనాడుల్లోనూ భారీ వర్షాలు నమోదయ్యాయి. దక్షిణ కన్నడ, చామరాజనగర, ఉడుపి జిల్లాల్లో వచ్చే 48 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. మండ్య జిల్లాలోని మద్దూరు- 102,నాగరకెరె-98, బెసగారహళ్లి- 79, కేఎం దొడ్డి- 46 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలకు కేఆర్ఎస్ రిజర్వాయర్‌లో ఇన్‌ఫ్లో పెరిగింది.

తమిళనాడులోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం సాయంత్రం వేలూరు జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులు వణకించాయి. వేలూరుతో పాటు అంబూర్, గుడియాత్తం, వాలాజాపేట, రాణిపేట, చెంగం, పోలూరు, జోలార్‌పేట్టై వంటి చోట్ల భారీ వర్షాలు ముంచెత్తాయి. తిరుపత్తూరు, తిరువణ్ణామలై జిల్లాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షం నమోదైంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications