Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాన్సూన్ అప్‌డేట్స్: గుజరాత్, తెలంగాణలలో భారీ వర్షాలు!

న్యూఢిల్లీ: గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్, తెలంగాణ, ఉత్తరాంధ్ర, తెలంగాణలపై రుతుపవనాల ప్రభావం ఎక్కువగానే ఉండే అవకాశముంది. ఈ ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉంది. అనుప్‌గర్, సికర్, గ్వాలియర్, సిద్ధి, అంబికాపూర్, చైబసా, బాలాసోర్ మీదుగా నార్త్ వెస్ట్ బెంగాల్ వైపు రుతుపవనాలు పయనిస్తున్నాయి.

నార్త్ వెస్ట్ బంగాళాఖాతం, దానిని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం విస్తరిస్తుందని గురువారం నాడు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పుడు అక్కడ అల్పపీడన ప్రభావం కనిపిస్తోంది.

ఇది క్రమంగా వెస్ట్ వైపు నుంచి సెంట్రల్ ఇండియా వైపు పయనిస్తుంది. దీంతో ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో రానున్న 48 గంటలలో వర్షాలు కురవనున్నాయి. దీని ప్రభావంతో 16వ తేదీన మహారాష్ట్రలో వర్షాలు కురుస్తాయి. రుతుపవనాలు బికనీర్, అజ్మీర్, గుణ, దామోహ్, అంబికాపూర్, రూర్కేలా మీదుగా కొనసాగుతున్నాయి.

Monsoon update: Heavy rain likely in Odisha, Konkan, Goa and Gujarat

వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ మాన్సూన్ సీజన్‌లో ఇంటీరియర్ ఒడిశా, కొంకణ్, గోవా తదితర ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తెలంగాణలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తూర్పు మధ్యప్రదేశ్, సౌరాష్ట్ర, విదర్భ, చత్తీస్ గఢ్, మధ్య మహారాష్ట్ర, సౌత్ ఇంటీరియర్ కర్ణాటకలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కోస్టల్ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలలో, కేరళలో భారీ వర్షాలు, అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, వెస్ట్ ఉత్తర ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఉత్తరాఖండ్, ఈస్ట్ రాజస్థాన్, వెస్ట్ మధ్యప్రదేశ్, మరాట్వాడ, నార్త్ ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడులలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

కాగా, నైరుతీ రుతుపవనాలు మే 29వ తేదీన కేరళను తాకాయి. సాధారణం కంటే మూడు రోజులు ముందు వచ్చాయి. భారీ వర్షాల కారణంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ మాన్సూన్‌లో సెంట్రల్ ఇండియా సాధారణ వర్షపాతాన్ని, దక్షిణాది ప్రాంతంలోని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా. ఉత్తర-తూర్పు భారతదేశంలో కూడా సాధారణ వర్షపాతం నమోదు కానుంది.

దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ) 90శాతం-96శాతం ఉంటే సాధారణం కంటే తక్కువ అని, 96-104శాతం ఉంటే సాధారణం అని పరిగణిస్తారు. 90శాతం కంటే తక్కువగా ఉంటే తక్కువ వర్షపాతంగా తీసుకుంటారు. 104-110శాతం ఉంటే సాధారణం కంటే ఎక్కువ, 110శాతం కంటే ఎక్కువగా ఉంటే అత్యధిక వర్షపాతంగా తీసుకుంటారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+