'ట్రంప్ సీజ్ ఫైర్' విమర్శల వేళ కేంద్రం కీలక నిర్ణయం..!!
కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ సింధూర్.. కాల్పుల విరమణ.. ట్రంప్ జోక్యం పైన కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేసారు. ట్రంప్ కు మోదీ సరెండర్ అయ్యారని రాహుల్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఈ పరిణామాల పైన బీజేపీ నాయకత్వం ఆచి తూచి స్పందిస్తోంది. ఇదే సమయంలో వీటికి అన్నింటికి సమాధానం ఇచ్చే విధంగా కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది.
ఆపరేషన్ సింధూర్.. తదనంతర పరిణామాల వేళ కేంద్రం పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు నిర్ణయించింది. జులై 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన విషయాలపై పార్లమెంట్ ప్రత్యేక సమా వేశంలో చర్చించాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. 23 రోజుల పాటూ జరిగే ఈ సమావేశాల్లో కీలకమైన బిల్లులను కూడా కేంద్రం ప్రవేశపెట్టనున్నారు. జాతీయ భద్రత, ఆర్థిక స్థితిగతులపై కూడా చర్చించే అవకాశం ఉంది.

పహల్గాం ఉగ్రదాడి తరువాత 'ఆపరేషన్ సిందూర్' పేరిట పాక్ వైమానిక స్థావరాలను భారత సైన్యం పాక్ తో పాటుగా పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. భారీ సంఖ్యలో ఉగ్ర వాదులను తుద ముట్టించింది. ఆ తరువాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలుత భారత్ - పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లు ప్రకటించారు. దీనికి కొనసాగింపుగా భారత్,పాక్ సైతం కాల్పుల విరమణను నిర్ధారించాయి. ట్రంప్ జోక్యం పైన ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీ సాయి. ఆపరేషన్ సిందూర్‌పై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని ప్రతిపక్షానికి చెందిన 16 పార్టీల ప్రతినిధులు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు.
ప్రధానికి రాసిన ఈ లేఖపై లోక్‌సభకు చెందిన 200 మందికి పైగా విపక్ష ఎంపీలు సంతకాలు చేశారు. భారత్-పాక్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి తానే మధ్యవర్తిత్వం వహించా నని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై కూడా ఈ సందర్భంగా చర్చించాలని పట్టుబట్టారు. సరిహద్దు గ్రామాల్లో పాక్ రేంజర్లు జరిపిన షెల్లింగ్‌లో ప్రాణాలు విడిచిన పౌరుల గురించి కూడా చర్చించాలని గుర్తు చేశారు. పహల్గాం ఉగ్రదాడి తదనంతరం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విషయంలో తమ ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రభుత్వానికి మద్దతునిచ్చాయన్న విపక్ష నేతలు.. తమ డిమాండ్ మేరకు కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో, పార్లమెంట్ వేదికగా వీటన్నింటికి సమాధానం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
-
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications