మాన్సూన్ అప్‌డేట్స్: ఈశాన్య రాష్ట్రాలలో వర్షాలు
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాలలో గత కొద్ది రోజులుగా చెదురుముదురు భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా అసోం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్‌లలోని పలు ప్రాంతాలలో సాధారణం నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి.
Recommended Video

రానున్న 48 గంటల్లో బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం విస్తరించే అవకాశముంది. ప్రస్తుత మాన్సూన్ పరిస్థితులు దక్షిణాదిన, సెంట్రల్ ఇండియాలో మరో 45 రోజుల పాటు కొనసాగే అవకాశముంది.

నేటి నుంచి నార్త్ వెస్ట్ ఇండియాలో వర్షాలు మరిన్ని కురిసే అవకాశాలు ఉన్నాయి. అరేబియా సముద్రంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొనే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి రానున్న నాలుగు రోజుల్లో ఉండే అవకాశముంది.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల మేరకు ఈ మాన్సూన్‌లో కొంకణ్, గోవాలలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. వెస్ట్ మధ్యప్రదేశ్, సౌత్ గుజరాత్ ప్రాంతాలలోని పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కోస్టల్ కర్ణాటక, కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, సౌరాష్ట్ర, ఉత్తరాఖండ్, ఈస్ట్ రాజస్థాన్, ఈస్ట్ మధ్యప్రదేశ్, సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, ఈస్ట్ రాజస్థాన్, ఈస్ట్ మధ్యప్రదేశ్, సౌత్ ఇంటీరియర్ కర్ణాటకలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒడిశాలోని పలు ప్రాంతాలు, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, మధ్య మహారాష్ట్ర, విదర్భలలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
కాగా, నైరుతీ రుతుపవనాలు మే 29వ తేదీన కేరళను తాకాయి. సాధారణం కంటే మూడు రోజులు ముందు వచ్చాయి. భారీ వర్షాల కారణంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ మాన్సూన్‌లో సెంట్రల్ ఇండియా సాధారణ వర్షపాతాన్ని, దక్షిణాది ప్రాంతంలోని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా. ఉత్తర-తూర్పు భారతదేశంలో కూడా సాధారణ వర్షపాతం నమోదు కానుంది.
దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ) 90శాతం-96శాతం ఉంటే సాధారణం కంటే తక్కువ అని, 96-104శాతం ఉంటే సాధారణం అని పరిగణిస్తారు. 90శాతం కంటే తక్కువగా ఉంటే తక్కువ వర్షపాతంగా తీసుకుంటారు. 104-110శాతం ఉంటే సాధారణం కంటే ఎక్కువ, 110శాతం కంటే ఎక్కువగా ఉంటే అత్యధిక వర్షపాతంగా తీసుకుంటారు.
-
విస్తరించిన ఉపరితల ఆవర్తనం- ఏపీలో 15 జిల్లాల్లో వర్షాలు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications