మాన్సూన్ అప్‌డేట్స్: రాజస్థాన్‌లో వేడిగాలులు

Posted By:
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    న్యూఢిల్లీ: రుతుపవనాలు శ్రీగంగానగర్, అల్వార్, నౌగాంగ్, శిద్ధి, అంబికాపూర్, చిల్బస, దింగా నుంచి ఈస్ట్ సౌత్ ఈస్ట్ మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం దిశగా పయనిస్తోంది.

      ఏపీ-తెలంగాణలో భారీ వర్షాలు: వాతావరణ శాఖ

      రానున్న 56 రోజుల్లో రుతుపవనాల ప్రభావం సాధారణంగా ఉండనుంది. ఉత్తర బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం విస్తరిస్తుంది. అలాగే, ఆ పరిసర ప్రాంతాల్లోను రానున్న 24 గంటల్లో ఈ ప్రభావం ఉంటుంది.

      Monsoon update: Heavy rain likely in Gujarat, Konkan, Goa and Uttrakhand

      సెంట్రల్ ఇండియా, దక్షిణ భారత ప్రాంతంలలో రానున్న 45 రోజుల్లో ఇదే పరిస్థితి నెలకొనే అవకాశముంది. ఈ రోజు నుంచి నార్త్ వెస్ట్ ఇండియాలోని పలు ప్రాంతాలలో వర్ష ప్రభావం పెరిగే అవకాశముంది. తూర్పు, నార్త్ వెస్ట్ ఇండియాలో రానున్న 23 రోజుల్లో సాధారణ వర్షపాతానికి అవకాశముంది.

      అరేబియా సముద్రంలోని పలు ప్రాంతాలు, బంగాళాఖాతంలోను రానున్న నాలుగు రోజుల్లో కల్లోల పరిస్థితులు ఉండే అవకాశముంది. వెస్ట్ రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో వేడి గాలుల పరిస్థితులు ఉన్నాయి.

      వాతావరణ శాఖ తెలిపిన వివరాల మేరకు ఈ మాన్సూన్‌లో కొంకణ్, గోవాలలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. వెస్ట్ మధ్యప్రదేశ్, సౌత్ గుజరాత్ ప్రాంతాలలోని పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కోస్టల్ కర్ణాటక, కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, సౌరాష్ట్ర, ఉత్తరాఖండ్, ఈస్ట్ రాజస్థాన్, ఈస్ట్ మధ్యప్రదేశ్, సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, ఈస్ట్ రాజస్థాన్, ఈస్ట్ మధ్యప్రదేశ్, సౌత్ ఇంటీరియర్ కర్ణాటకలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒడిశాలోని పలు ప్రాంతాలు, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, మధ్య మహారాష్ట్ర, విదర్భలలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

      కాగా, నైరుతీ రుతుపవనాలు మే 29వ తేదీన కేరళను తాకాయి. సాధారణం కంటే మూడు రోజులు ముందు వచ్చాయి. భారీ వర్షాల కారణంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ మాన్సూన్‌లో సెంట్రల్ ఇండియా సాధారణ వర్షపాతాన్ని, దక్షిణాది ప్రాంతంలోని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా. ఉత్తర-తూర్పు భారతదేశంలో కూడా సాధారణ వర్షపాతం నమోదు కానుంది.

      దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ) 90శాతం-96శాతం ఉంటే సాధారణం కంటే తక్కువ అని, 96-104శాతం ఉంటే సాధారణం అని పరిగణిస్తారు. 90శాతం కంటే తక్కువగా ఉంటే తక్కువ వర్షపాతంగా తీసుకుంటారు. 104-110శాతం ఉంటే సాధారణం కంటే ఎక్కువ, 110శాతం కంటే ఎక్కువగా ఉంటే అత్యధిక వర్షపాతంగా తీసుకుంటారు.

      English summary
      The axis of monsoon trough continues to pass through Sri Ganganagar, Alwar, Nowgong, Sidhi, Ambikapur, Chaibasa, Digha and then east¬southeastwards to East central Bay of Bengal.

      Oneindia బ్రేకింగ్ న్యూస్
      రోజంతా తాజా వార్తలను పొందండి

      X
      We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more