వెదర్ రిపోర్ట్: ఏపీ తీరం, సీమ, తెలంగాణల్లో ఈదురుగాలులు, ఉరుములతో వర్షాలు

న్యూఢిల్లీ: రానున్న 24గంటల్లో నాగాలాండ్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, అస్సాంలోని పలు ప్రాంతాల్లో నైరుతు రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.

గురువారం భారత వాతావరణ కేంద్రం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. థానే(ముంబైని కలుపుకుని), అహ్మద్ నగర్, బుల్ధానా, అమ్రోటి, గోండియా, తిట్లగఢ్, కటక్, మిడ్నాపూర్, గోవల్పర, బగ్ఘోగ్రా ప్రాంతాల్లో రుతువపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. అయితే, రుతుపవనాలు బలహీనంగా ఉన్నందున వాటి ప్రభావం వారం రోజుల వరకు ఎక్కువగా ఉండే అవకాశం లేదు.

Monsoon update: Heavy rain likely over Coastal, South Interior Karnataka and Assam today

అస్సాం, మేఘాలయ, పరిసర రాష్ట్రాల్లో తుఫానులు వచ్చే అవకాశం ఉంది. సముద్ర మట్టంపై 4.5కి.మీ వరకు ఇది కొనసాగుతుంది. తీరప్రాంతాలు, కర్ణాటక, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Monsoon update: Heavy rain likely over Coastal, South Interior Karnataka and Assam today

కేరళ, పశ్చిమబెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తమిళనాడు, తెలంగాణ, రాయలసీమ, ఉత్తర కోస్తాంధ్ర, గ్యాంగ్‌టక్ పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.

Monsoon update: Heavy rain likely over Coastal, South Interior Karnataka and Assam today

కర్ణాటక, కేరళ తీరం, తమిళనాడు తీరం, లక్షద్వీప్ తీరం, ఒడిశా పశ్చిమబెంగాల్ తీరం, అండమాన్ నికోబార్ దీవుల్లో గంటకు 45-55 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో సముద్రం కొంత భయంకరమైన అలలతో ఎగిసిపడే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+