వెదర్ రిపోర్ట్: ఉత్తరాది రాష్ట్రాలతోపాటు రాయలసీమలో భారీ వర్షాలు
Recommended Video

న్యూఢిల్లీ: రుతుపవనాలు ఉత్తరభారతదేశంపై పయనిస్తుండటంతో ఉత్తరాధి రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. గత వారమే రుతుపవనాలు దేశమంతా వ్యాపించాయి.
ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరభారతదేశం వైపు కొనసాగుతున్న రుతుపవనాల ప్రభావం కారణంగా రాబోయే 2-3రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్, హర్యానా, ఛండీగఢ్, పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, సబ్ హిమాలయన్ వెస్ట్ బెంగాల్, సిక్కిం, మేఘాలయ రాష్ట్రాల్లో రాబోయే 24గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

హిమాచల్‌ప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. వీటితోపాటు హర్యానా, ఛండీగఢ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కొంకణ్, గోవా, రాయలసీమ, తమిళనాడు, లక్ష్యద్వీప్, కర్ణాటక తీర ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తరప్రదేశ్, సబ్ హిమాలయన్ వెస్ట్ బెంగాల్, సిక్కిం, బీహార్ రాష్ట్రాల్లో బుధవారం భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తర హర్యానా, ఛండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కొంకణ్, గోవా, రాయలసీమ, కర్ణాటక తీర ప్రాంతం, తమిళనాడు, అస్సాం, మేఘాలయ, కొంకణ్, గోవాలో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications