సర్వే సందడి: విపక్షాల నుంచి ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారంటే ప్రజల ఎవరివైపు మొగ్గు చూపారంటే..?
విపక్షాల నుంచి దేశ తదుపరి ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారో అనే ఛాయిస్ భారతీయులకు ఇస్తే వారు ఎవరి వైపు మొగ్గు చూపారో తెలుసా..? సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సర్వేల సందడి మొదలైంది. ముఖ్యంగా జాతీయ మీడియా ఛానెళ్ల ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. అనేక అంశాలు పరిగణలోకి తీసుకుని వారు ప్రజలముందుకు వెళ్లడం జరిగింది. ఈ క్రమంలోనే దేశ ప్రధానిపై మరో ఆసక్తికర విషయం వెల్లడైంది.

మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ప్రముఖ జాతీయ మీడియా సర్వే
ఎన్నికల వేళ ప్రతి చిన్న అంశం ఆసక్తిని కలిగిస్తోంది. సర్వేల సందడి ప్రారంభమైన నేపథ్యంలో చాలామంది ఈ సర్వేల ఫలితాలపైనే చర్చించుకుంటున్నారు. తాజాగా విపక్షాల నుంచి తదుపరి దేశ ప్రధానిగా ఎవరుంటే బాగుంటుందన్న చర్చ మొదలైంది. ఇందులో భాగంగానే ప్రముఖ జాతీయ ఛానెల్ ఇండియా టుడే కార్వే ఇన్‌సైట్స్‌తో కలిపి మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో దేశ తదుపరి ప్రధానిపై ప్రజలను అడిగింది. దీంతో బీజేపీకి షాక్ ఇచ్చేలా ప్రజల సమాధానం ఉంది.

రాహుల్ గాంధీకి జై కొట్టిన ప్రజలు
విపక్షాల నుంచి తదుపరి దేశ ప్రధానిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అయితే బాగుంటుందని సర్వేలో పాల్గొన్న 52శాతం మంది ప్రజలు తెలిపారు. నరేంద్ర మోడీ కంటే రాహుల్ నాయకత్వమే బాగుంటుందని వారు తమ అభిప్రాయాన్ని తెలిపారు. మరో 46శాతం మంది ప్రధానిగా నరేంద్ర మోడీ అయితేనే బాగుంటుందని అన్నారు. రాహుల్ గాంధీతో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ ఛీఫ్ అఖిలేష్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం పేర్లను కూడా సర్వే సంస్థ ఆప్షన్స్‌లో ఉంచింది. రాహుల్ గాంధీకి ఎక్కువ మార్కులు పడగా ఆ తర్వాత ప్రధాని మంత్రిగా మమతా బెనర్జీకి మార్కులు పడ్డాయి. అయితే రాహుల్ గాంధీ మమతా బెనర్జీల పాపులారిటీల మధ్య 44 శాతం వ్యత్యాసం ఉంది.

8శాతం మంది మాత్రమే మమత బెనర్జీ వైపు మొగ్గు
ఇదిలా ఉంటే కేవలం 8శాతం మంది మాత్రమే ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయంగా మమత బెనర్జీ వైపు మొగ్గారు. ఇక బీఎస్పీ అధినేత్రి మాయావతి, అఖిలేష్ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లు ప్రధాని రేసుకు సరిపోరని ప్రజలు అభిప్రాయపడ్డారు. నాలుగు శాతం మంది మాత్రమే అరవింద్ కేజ్రీవాల్‌కు ఓటువేయగా.. మాయావతికి 3శాతం, అఖిలేష్‌కు 5శాతం మంది మద్దతు తెలిపారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications