ఏబీపీ సర్వే: మళ్లీ మోడీదే గెలుపు, బాగా పుంజుకున్న కాంగ్రెస్, ఆ రాష్ట్రాల్లో బీజేపీకి దెబ్బ

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నాలుగేళ్ల పాలన నేపథ్యంలో ఏబీపీ - సీఎస్‌డీఎస్ మూడ్ ఆప్ ది నేషన్ పేరుతో సర్వే చేసిన విషయం తెలిసిందే. 2019లో పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేసింది. ఈ సర్వే ద్వారా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎవరు గెలుస్తారు, ఏ రాష్ట్రంలో ఎవరు ముందంజలో ఉంటారో వెల్లడించింది.

2014తో పోల్చుకుంటే మోడీ హవా కొద్దిగా తగ్గినప్పటికీ ఎన్డీయేదే విజయమని తేల్చింది. రాహుల్ గాంధీ ప్రతిష్ట కొంత పెరిగినట్లుగా సర్వే వెల్లడించింది. ఎన్డీయేకు 274 సీట్లు, యూపీఏకు 164 సీట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది.

Mood of the Nation: UPA consolidates, but Modi will return to power

రాష్ట్రాల విషయానికి వస్తే మధ్యప్రదేశ్, యూపీ, రాజస్థాన్‌లలో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని తెలిపింది. బీహార్, ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ మంచి ఫలితాలు రాబట్టనుంది.

ప్రాంతాల వారీగా ఓట్ షేర్ చూస్తే..

ఉత్తర భారత దేశం: ఎన్డీయే- 39%; యూపీఏ- 21%; ఇతరులు- 40%
ఈశాన్య భారతం: ఎన్డీయే- 43%; యూపీఏ- 25%; ఇతరులు- 32%
సెంట్రల్, వెస్టర్న్ ఇండియా: ఎన్డీయే- 48%; యూపీఏ- 43 %; ఇతరులు- 9%
దక్షిణ భారత దేశం: ఎన్డీయే- 18%; యూపీఏ- 38%; ఇతరులు- 44%
భారత్ మొత్తం చేస్తే ఎన్డీయే- 37%; యూపీఏ- 31%; ఇతరులు- 32%

యూపీఏలో ఎస్పీ, బీఎస్‌పీ కలిసి పోటీచేస్తే బీజేపీ బాగా నష్టపోయే అవకాశముంది. ఈరోజు ఎన్నికలు జరిగితే ఎన్డీఏకి 35%, ఎస్పీ-బీఎస్పీ కూటమికి 46% ఓట్లు లభిస్తాయి.
గుజరాత్‌లో ఎన్డీఏకి 54%, యూపీఏకి 42%, ఇతరులకు 4% ఓట్లు దక్కే అవకాశముంది. 2014 ఎన్నికలతో పోలిస్తే ఇక్కడ కాంగ్రెస్‌కు 9% ఓట్లు పెరగవచ్చు. మహారాష్ట్రలో ఎన్డీఏకి 48%, యూపీఏకి 40%, ఇతరులకు 21% ఓట్లు లభించే అవకాశముంది. ఈ ఓట్ల శాతం సాధించాలంటే బీజేపీ-శివసేన కలిసి పోటీచేయాలి. దానితో సంబంధాలు కొనసాగించాలి. 2014లో ఇక్కడ ఎన్డీఏకి 51% ఓట్లు వచ్చాయి.

మధ్యప్రదేశ్‌ శానససభ ఎన్నికలు ఇప్పటికప్పుడు జరిగితే కాంగ్రెస్‌కు 49%, బీజేపీకి, 34%, ఇతరులకు 17% ఓట్లు లభించే అవకాశముంది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి తృణమూల్‌కు 44%, బీజేపీకి 24%, లెఫ్ట్ పార్టీలకు 17%, కాంగ్రెస్‌కు 11% ఓట్లు దక్కవచ్చు. రాజస్థాన్‌లో బీజేపీకి ఇబ్బందే. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు 44%, బీజేపీకి 39%, ఇతరులకు 17% ఓట్లు రావొచ్చు. 2013లో ఇక్కడ బీజేపీ 45%ఓట్లు దక్కించుకొంది. బీహార్‌లో బీజేపీ-జేడీయూ కూటమి పరిస్థితి బాగానే ఉంది. ఇప్పుడు ఎన్నికలు జరిగినా ఈ కూటమి మంచి ఫలితాలను సాధిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+