మరిన్ని మృతేదేహలు.. యూపీ బాలియా తీరంలో వెలుగులోకి...
గంగా నదీ తీరంలో కరోనా సోకి చనిపోయిన మృతదేహలు కనిపిస్తూనే ఉన్నాయి. వాటిని శునకాలు పిక్కు తినడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. యూపీతోపాటు బీహర్‌లో గల గంగానదీ తీరంలో మృతదేహాలు కనిపించాయి. అయితే యూపీలో గల బలియా జిల్లాలో మరో రెండు డెడ్ బాడీస్ కనిపించాయి. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శునకం ఓ శవాన్ని పిక్కుతింటోన్న దృశ్యం కలచివేస్తోంది.
గురువారం మధ్యాహ్నం మృతదేహల గురించి సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలానికి ఎస్‌డీఎం చేరుకుని మృతదేహాలను దహనం చేశారని తెలిపారు. మృతుల కుటుంబసభ్యులు అంత్యక్రియల ప్రక్రియ పూర్తిచేసి నదిలో వదిలి వెళ్లారని తెలుస్తోంది.

బాలియాలో గల నదీ గుండా భారీగా మృతదేహాలు కొట్టుకు వస్తున్నాయి. 52 డెడ్ బాడీస్ చూశామని స్థానికులు తెలిపారు. ఉజియార్, కుహ్లడియా, భౌరలీ ఘాట్, నారహి నుంచి వస్తున్నాయని చెబుతున్నారు. అయితే మృతదేహాలు కొట్టుకు వచ్చిన అంశానికి సంబంధించి అధికారులు మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. ఇప్పటివరకు ఎన్ని లభించాయి.. దహనం చేశారనే అంశంపై క్లారిటీ ఇవ్వడం లేదు.












Click it and Unblock the Notifications