మోడీవైపే భారత్: అమెరికా సంస్థ సర్వేలో బిజెపి హవా

ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి శృంగభంగం తప్పదని సర్వేలో తేలింది. సదరు సంస్థ డిసెంబర్ 7- జనవరి 12 మధ్య కాలం మధ్యలో సర్వే నిర్వహించింది. దీనిలో భాగంగా సుమారు 12వేలమందిని ప్రశ్నించగా 2464మందిని నేరుగా ఇంటర్వ్యూ చేసింది. ప్రతి ఐదుగురు భారతీయుల్లో ముగ్గురు బిజెపి వైపే మొగ్గు చూపుతుండగా, ఒక్కరు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు.
బిజెపికి 63 శాతం మంది మద్దతు తెలుపుతుండగా, కాంగ్రెస్‌కు మాత్రం 19 శాతం మాత్రమే మద్దతు లభించింది. బిజెపికి ఓటేస్తామని పట్టణ ప్రాంతంలో 60 శాతం మంది చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో 64 శాతంగా చెప్పారు. ఇక ఉత్తర భారత దేశంలో అయితే బిజెపి హవా ఎక్కువగా ఉంది. 74 శాతం ఉత్తర భారతీయులు బిజెపికే అనుకూలంగా ఉన్నారు. యూపిఏ ప్రభుత్వ పాలనపై 70 శాతం మంది అసంతృప్తితో ఉన్నారు.
భారత్‌లో ప్రతి పదిమందిలో ఆరుగురు కొత్త ప్రభుత్వాన్ని బిజెపినే ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. ఇద్దరే కాంగ్రెసుకు మద్దతిస్తున్నారు. పన్నెండు శాతం మంది ఇతర పార్టీలకు మద్దతు తెలిపారు. చిన్న, పెద్ద, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అనే తేడా లేకుండా బిజెపికి అన్ని వర్గాల వారు మద్దతు తెలిపారు. యుపి, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, ఢిల్లీల్లో బిజెపికి ముప్పావు వంతు మంది మద్దతు పలికారు. అయితే మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, గుజరాత్ రాష్ట్రంలో 54 శాతం మందే మద్దతు తెలిపారట.












Click it and Unblock the Notifications