మోస్ట్ పవర్‌ఫుల్ ఇండియన్స్ జాబితా రిలీజ్..తెలుగు నుంచి ఏకైక హీరో అతనే
భారతదేశంలో 2025 సంవత్సరానికి అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితా విడుదలైంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రూపొందించిన 2025 టాప్ 100 మోస్ట్ పవర్‌ఫుల్ ఇండియన్స్ జాబితాను రిలీజ్ చేశారు.ఈ జాబితాలో ప్రధాని మోదీ మొదటి స్థానంలో నిలిచారు.రాజకీయ రంగంలో ఆయనకున్న తిరుగులేని ఆధిపత్యం కారణంగా, భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన శక్తివంతమైన నాయకుడిగా పరిగణించబడ్డారు. జవహర్‌లాల్ నెహ్రు తర్వాత వరుసగా మూడుసార్లు దేశానికి ప్రధానిగా పని చేశారు మోదీ. మూడోసారి కేంద్రంలో ప్రధానిగా పగ్గాలు చేపట్టడం తన పట్ల ప్రజాదరణ తగ్గకుండా చేసిందని ఈ నివేదిక పేర్కొంది.
రెండోస్థానంలో అమిత్ షా నిలిచారు.భారత ప్రభుత్వంలో హోం మంత్రిగా, రాజకీయాల్లో ఆయనకున్న పట్టు కారణంగా అమిత్ షా కూడా శక్తివంతమైన నాయకుడిగా ఉన్నారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక తెలిపింది. విదేశాంగ మంత్రిగా ఉన్న సుబ్రమణ్యం జైశంకర్ మూడోస్థానంలో నిలిచారు.జైశంకర్ భారతీయ జనతా పార్టీ సభ్యుడు. ఇంతకు ముందు 2015 నుండి 2018 వరకు భారత విదేశాంగ కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) నాయకుడిగా, భారత రాజకీయాల్లో ఆయన ప్రభావం ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందిన మోహన్ భగవత్ నాలుగో స్థానంలో నిలిచారు.లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ 9వ స్థానంలో నిలిచారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ వ్యాపార రంగంలో ఆయనకున్న ప్రభావం కారణంగా ఆయన కూడా శక్తివంతమైన వ్యక్తిగా నిలిచారు. ఈ జాబితాలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, మత గురువులు, సినీ ప్రముఖులు వంటి అనేక రంగాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు.క్రికెటర్లలో రోహిత్ శర్మ 48, విరాట్ కోహ్లీకి 72, బుమ్రా 83 స్థానం దక్కించుకున్నారు. అలియా బట్ 100 ర్యాంక్‌లో ఈ జాబితాలో ఆఖరిలో నిలిచారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎంఐఎం అధ్యక్షుడు అసద్దుదీన్ ఒవైసీ, తెలుగు స్టార్ హీరో అల్లు అర్జున్‌లకు మోస్ట్ పవర్‌ఫుల్ ఇండియన్స్ జాబితాలో స్థానం దక్కింది. చంద్రబాబు 14వ స్థానం, రేవంత్ రెడ్డి 28వ స్థానం, పవన్ కల్యాణ్ 73వ స్థానం,అల్లు అర్జున్ 92వ స్థానంలో నిలిచారు.












Click it and Unblock the Notifications