ఒకే వ్యక్తిని ప్రేమించిన తల్లీకూతుళ్లు: లవర్‌తో కలిసి హత్య

చంఢీగడ్: తల్లి, కూతురు ఇద్దరూ ఒకే వ్యక్తిని ప్రేమించారు. అయితే ఈ ప్రేమలో తల్లే పైచేయి సాధించింది. లవర్ కోసం కన్న తల్లే కూతురిని అత్యంత దారుణంగా హతమార్చిన సంఘటన చండీగడ్‌లోని ఆబోహర్ పట్టణంలో చోటు చేసుకుంది. కూతురిని ప్రియుడితో కలసి హత్య చేసింది.

అయితే ఆమె తల్లి ఇది ఆత్మహత్యగా చిత్రీకరించి అందరినీ నమ్మించింది. కానీ చివరకు కూతురి మరణం వెనుక అసలు రహస్యాన్ని తెలుసుకుని పోలీసులు ఆశ్చర్యపోయారు. ఈ కేసులో లవర్ విజయ్ కుమార్ అలియాస్ సోనుతోపాటు యువతి తల్లిని కూడా అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే... మంజు అనే 37 ఏళ్ల వివాహితకు దీక్ష అనే 17 ఏళ్ల కుమార్తె ఉంది. తల్లి కూతురిద్దరూ పంజాబ్‌లోని ఆబోహర్ పట్టణంలో నివాసం ఉండేవారు. కాగా.. మంజుకి ఫేస్‌బుక్ ద్వారా సౌదీ అరేబియాలో ఉండే విజయ్ కుమార్ అలియాస్ సోను అనే వ్యక్తితో 2015 అక్టోబర్‌లో పరిచయం ఏర్పడింది.

Mother, Facebook lover arrested for killing teen girl, disguising it as suicide

ఆ పరిచయం కాస్త ప్రేమగా చిగురించింది. కాల క్రమంలో ఈ ప్రేమ కాస్త విడదీయరాని బంధంగా మారిపోయింది. ఈ క్రమంలో ఆమెను చూడాలని గత డిసెంబర్‌లో విజయ్ ఇండియాకు వచ్చాడు. జనవరి నుంచి మంజు ఇంట్లోనే ఉంటూ మంజుతో సహజీవనం చేసేవాడు విజయ్.

ఈ క్రమంలో ఆమె కూతురు దీక్షపై కూడా కన్నేశాడు. దీక్షతో విజయ్ బాగా సన్నిహితంగా ఉండడంతో.. దీక్ష కూడా అతని వలలో పడిపోయింది. ఇదిలా ఉంటే ఒకరోజు మంజు, విజయ్ పడగ గదిలో సరససల్లాపాలు సాగిస్తుండడం చూసి దీక్ష నివ్వెరపోయింది. ఈ విషయంపై దీక్ష తల్లితో గొడవ పడింది.

తాను విజయ్‌ని గాఢంగా ప్రేమిస్తున్నట్లు తల్లితో చెప్పింది. ఈ విషయంలో వీరి మధ్య గొడవ మొదలయ్యింది. విజయ్ తనకే దక్కాలని, తననే పెళ్లి చేసుకుంటాడంటూ తల్లీకూతుళ్ల మధ్య పోటీ మొదలైంది. విజయ్ మీదున్న ప్రేమతో దీక్ష తన మణికట్టుపై విజయ్ పేరుని పచ్చ పొడిపించుకుంది.

దీనితో తన ప్రియుడిని కూతురు ఎక్కడ ఎగరేసుకుపోతుందోనన్న భయంతో మంజు ఏ తల్లి చేయని పనిని చేయడానికి నిర్ణయించుకుంది. కూతుర్ని చంపేందుకు పథకం వేసింది. ఓ పథకం ప్రకారం గత నెల 24న ప్రియుడితో చేతులు కలిపి ఫ్యాన్‌కు ఉరివేసి దీక్షను చంపేశారు.

కుటుంబ తగాదాల కారణంగానే దీక్ష ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా అందిరినీ నమ్మించడం కోసం, దీక్ష రాసినట్టుగా విజయ్ సూసైడ్ నోట్ రాసి పెట్టాడు. పోలీసులను కూడా నమ్మించే ప్రయత్నం చేశారు. తల్లి ఫిర్యాదు మేరకు ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

అయితే విచారణ జరిపిన పోలీసులు దీక్ష చేతిపై విజయ్ పేరు పచ్చబొట్టు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా లవర్ విజయ్ కోసమే తన కుమార్తెను చంపుకున్నట్లు నేరాన్ని అంగీకరించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+