టీ వేడిగా లేదని తిట్టిన అత్త.. ఇనుప రాడ్ తో కొట్టి చంపిన కోడలు
టీ వేడిగా లేదని తిట్టిన అత్తను ఇనుప రాడ్ తో ఒక కోడలు కొట్టి చంపిన ఘటన తమిళనాడులోని మలైకుడిపట్టిలో చోటు చేసుకుంది.
సమాజంలో రోజురోజుకీ మనుషులలో క్రూరత్వం పెరిగిపోతుంది. చిన్న చిన్న కారణాలకే దాడులు చేయడం ప్రాణాలు తీయడం నిత్య కృత్యంగా మారిపోయింది. ఎక్కడ చూసినా చిన్న కారణాలకే జరుగుతున్న హత్యలు సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇక తాజాగా తమిళనాడు రాష్ట్రంలో అత్తా కోడళ్ళ మధ్య టీ కోసం చిన్న విషయంలో చోటు చేసుకున్న ఘర్షణ కోడలు అత్త ప్రాణం తీసేదాకా వెళ్ళింది.
ఇంతకు ఏం జరిగిందంటే తమిళనాడులోని మలైకుడిపట్టిలో వేలు పుదుకోట్టై భార్య పళని అమ్మాళ్, కుమారుడు సుబ్రమణి, కోడలు గనుకు తోటి కలిసి జీవనం సాగిస్తున్నారు. సైకిల్ రిపేర్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగించేవారు. ఇక కోడలు కొంత కాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టు సమాచారం. ఇటీవల ఆమె మందులను కూడా వాడటం లేదని సమాచారం. ఇదిలా ఉంటే మొన్న రాత్రి పళని అమ్మాళ్ కోడలిని టీ ఇవ్వమని అడిగింది. ఆమె అత్తకు టీ తెచ్చి ఇచ్చింది. అయితే టీ వేడిగా లేదని కోడలు గనుకను అత్త తిట్టింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఇక తీవ్ర ఆగ్రహానికి గురైన కోడలు పక్కనే ఉన్న ఇనుప రాడ్ ను తీసుకొని అత్తను చితకబాదింది. అత్త తలపై బలంగా కొట్టింది. మందులు వేసుకోకపోవటం వల్ల మానసిక వ్యాధితో బాధపడుతున్న కోడలు అత్తపై విచక్షణా రహితంగా దాడి చేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన పళని అమ్మాళ్ సంఘటన స్థలంలోనే కుప్పకూలిపోయింది. రక్తపు మడుగులో పడి ఉన్న పళని అమ్మాళ్ ను తిరుచ్చి ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ అత్త పళని అమ్మాళ్ మృతి చెందింది.
ఇక ఈ క్రమంలో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అత్తను ఇనుప రాడ్ తో కొట్టి హతమార్చిన కోడలిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇలాంటి అనేక చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కూర సరిగ్గా వండలేదని, ఇంటికి రమ్మంటే రాలేదని ఇలా చిన్న కారణాలకే ప్రాణాలు తీసేదాకా మనుషుల మానసిక స్థితి మారుతుండటం నిజంగా ఆందోళనకరం.












Click it and Unblock the Notifications