వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్న కూతుర్నే వ్యభిచార కూపంలోకి నెట్టింది

|
Google Oneindia TeluguNews

బుర్ద్వాన్: కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ కన్న తల్లి పేగు పంచుకుపుట్టిన కూతుర్ని(13) డబ్బులకు ఆశపడి వ్యభిచార కూపంలోకి నెట్టేసింది. పశ్చిమ బంగాలోని బుర్ద్వాన్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. మెమరీ ప్రాంతానికి చెందిన ఒక మహిళ జనవరి 5న తన 13 ఏళ్ల కుమార్తెను కోల్‌కతాలోని మరో మహిళకు అమ్మేసింది. అక్కడ ఆ బాలికపై కొందరు లైంగిక దాడికి పాల్పడ్డారు.

Mother sold 13-yr-old daughter into sex trade for Rs.60,000

అనంతరం బాలికతో పాటు మరికొందరిని ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తుండగా.. బాధిత బాలిక తప్పించుకుంది. ఆ తర్వాత బుర్ద్వాన్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుంది. జరిగిన విషయాన్ని చెప్పి.. తన తల్లిపై ఫిర్యాదు చేసింది.

రూ. 60వేలకు తన తల్లి తనను అమ్మేసిందని.. తాను దుండగుల నుంచి తప్పించుకున్నానని తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలిక తల్లిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

English summary
A 13-year-old girl today filed police complaint against her mother at Memari in Burdwan district alleging the woman had sold her for Rs 60,000 to traffickers in Kolkata who had sexually abused her, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X