థెరిస్సా ఇష్యూ: బీజేపీ మీనాక్షి, నటి దియామీర్జాల మధ్య వాగ్వాదం
న్యూఢిల్లీ: థెరిస్సా సేవల ఆంతర్యం, లక్ష్యం క్రైస్తవ మతంలోకి మార్పిడిలు చేయడమేనని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యల పైన బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి, సినీ నటి దియామీర్జాల మధ్య బుధవారం వాగ్వాదం జరిగింది. మోహన్ భాగవత్ వ్యాఖ్యలను మీనాక్షి లేఖి సమర్థించారు.
దాని పైన దియా మీర్జా భగ్గుమన్నారు. మీనాక్షి లేఖి సమర్థనను ఖండించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆమె ఓ పోస్ట్ చేశారు. క్రైస్తవ మతంలోకి ప్రజలను తీసుకు వెళ్లడమే తన కర్తవ్యం అని ఒకానొక సందర్భంలో మదర్ థెరిస్సా చెప్పినట్లు మీనాక్షి లేఖి పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యల పైన దియా మీర్జా స్పందించారు. గర్హించాల్సిన వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యత ఇవ్వడం సిగ్గుచేటు అని ఆమె ట్వీట్ చేశారు. దానికి మీనాక్షి లేఖి కూడా ధీటుగానే స్పందించారు. వాస్తవాలను ఎదుర్కొనే సామర్థ్యం లేని వ్యక్తిగా మీరు సిగ్గుపడాలని లేఖీ తీవ్రంగా స్పందించారు.
కాగా, థెరీసాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌కు శివసేన కూడా మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. ఆయన కొంత నిజమే చెప్పారని ఆ పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో పేర్కొంది. విదేశాల నుంచి మిషనరీలుగా వస్తున్న క్రైస్తవ సంస్థలు మన దేశంలో చాలామందిని క్రైస్తవ మతంలోకి మారుస్తున్నాయని ఆ పత్రికలో పేర్కొంది.
“@M_Lekhi: @deespeak Shame on you for not having the robustness to face the facts or accept the truth!” I hang my head in shame.
— Dia Mirza (@deespeak) February 24, 2015
My father was Catholic, my mother is a Bengali, I was raised by my Muslim step father and I'm married to a Hindu. I am Indian.
— Dia Mirza (@deespeak) February 25, 2015 ముస్లింలు కత్తితో బెదిరించి మత మార్పిడి చేస్తే, క్రైస్తవులు డబ్బు, సేవల పేరిట మతమార్పిడిలకు పాల్పడుతున్నారని ఆ శివసేన పేర్కొంది. అయితే, మనమంతా థెరిసా సేవలను గుర్తించామని, ఆమెలాగే చాలామంది కూడా సేవలందించారని, కానీ ఎలాంటి మతమార్పిడిలకు దిగలేదని సామ్నాలో పేర్కొంది.
ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ రాజస్ధాన్‌లోని భరత్ పూర్‌లో జరిగిన ఎన్జీఓ కార్యక్రమంలో నిరుపేదలకు మదర్ థెరిస్సా సేవ అందించడం వెనుకున్న ప్రధాన లక్ష్యం క్రైస్తవ మత మార్పిడేనని అన్నారు. మదర్ థెరిస్సా సేవలు మంచిదే. కానీ వ్యక్తులను క్రైస్తవ మతంలోకి మార్పిడి చేయడానికి సేవను ఆధారంగా చేసుకున్నారని అన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications