Daughters Day: ఈ డాటర్స్ డే నాడు తప్పకుండా తల్లులు ఇవి ఫాలో అవ్వాల్సిందే..
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నాలుగవ ఆదివారం నాడు డాటర్స్ డే జరుపుకుంటారు. ఈ రోజుకున్న ప్రాముఖ్యత గురించి తెలుసుకుని మీ చిట్టితల్లులకి శుభాకాంక్షలు చెప్పండి. అమ్మాయి పుడితే చాలామంది అయ్యో ఆడపిల్ల పుట్టిందా అని బాధపడేవాళ్లు ఉన్నారు. కొడుకు పుట్టగానే ఇంటికి వారసుడొచ్చాడని సంతోషపడే వారు ఉన్నారు. కానీ, నేటి సమాజంలో అమ్మాయిలపై జరిగే ఆకృత్యాలు చూస్తు అమ్మాయిలను పెంచాలన్న చాలామంది తల్లిదండ్రులు భయపడుతున్నారు. కానీ, నేటి సమాజంలో ఇద్దరు సమానులే. అమ్మాయిలు అన్ని రంగాల్లోనూ ముందుంటున్నారు. ఎక్కువశాతం మంది అమ్మాయిలు అమ్మలతో సన్నిహితంగా మెలుగుతారు. యుక్తవయసులో ఉన్న కుమార్తెలను అర్థం చేసుకోవడంలో చాలామంది తల్లులు చాలా తప్పులు చేస్తుంటారు. అలాంటి తప్పులు చేయకుండా వారిని అర్థం చేసుకుంటూ, సరైన మార్గంలో నడిపించేందుకు కృషి చేయాలి. యుక్తవయసులో ఉన్న కూతురితో ఎలా స్నేహం చేయాలో తెలుసుకునే కొన్ని చిట్కాలను చూద్దాం. ఆ చిట్కాలు కూడా ఈ డాటర్స్ డే నుంచి ఫాలో అవ్వండి.
తల్లీ కూతుళ్ల మధ్య అనుబంధం ఎంత క్లిష్టంగా ఉంటుందో అంతే అందంగా ఉంటుంది. కుమార్తెలు తమ తల్లులకు అత్యంత సన్నిహితంగా ఉంటారు. కానీ వారితోనే వారికి ఎక్కువుగా విభేదాలు వస్తూ ఉంటాయి. యుక్తవయస్సులో ఉన్న కుమార్తెలలో ఈ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. యుక్తవయసులో ఉన్న కూతురిని స్నేహితురాలుగా చూడడం ద్వారా ఆమె భావాలను సులభంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.

ఎవ్వరితోనూ పోల్చవద్దు...:మీ అమ్మాయిని ఆమె స్నేహితులు, పొరుగువారు లేదా తోబుట్టువులతో పోల్చవద్దు. ప్రతి ఒక్కరి యుక్తవయస్సు భిన్నంగా ఉంటుంది. ఇటువంటి సమయంలో మీ కుమార్తెను వేరొకరితో పోల్చడం ద్వారా ఆమె అనవసరమైన ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ఆమె మరింత ఒంటరిగా ఫీల్ అవుతారు. దీంతో మీ నుండి వారు దూరమయ్యే ప్రమాదం ఉంటుంది.
వారి మాటలు వినండి..:మీరు వారి మాటలు వినడం లేదని వారు భావిస్తే మీతో వారు ఎలాంటి విషయాలు పంచుకోరు. అందుకే, ముందుగా వారు చెప్పే మాటలను వినండి. వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతివిషయాన్ని వారు మీతో పంచుకోవడం వల్ల మీ మధ్య ఉండే కమ్యూనికేషన్ గ్యాప్ కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రతి విషయాన్ని ఓపెన్‌గా మాట్లాడండి..:యుక్తవయస్సులో ఉన్న కుమార్తెల్లో శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఇది వారి మనస్సులను గందరగోళానికి గురి చేస్తుంది. చాలా సార్లు వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియని సందిగ్ధంలో ఉంటారు. ఆ సమయంలో మీరు ఒక తల్లిగా కాకుండా, స్నేహితురాలిగా మారడం ఎంతో ముఖ్యం. కౌమారదశలో వచ్చే శారీరక, మానసిక మార్పుల గురించి వారితో ఓపెన్ గా మాట్లాడండి. అంతేకాకుండా, పీరియడ్స్, శారీరక సంబంధాలు మొదలైన వాటికి సంబంధించిన అన్ని విషయాల గురించి కూడా వారితో మాట్లాడాలి. దాంతో వారి మనస్సులోని గందరగోళాన్ని పరిష్కరించొచ్చు. వారికి ఎదురయ్యే ప్రతి సమస్యలో మీరు వారికి తోడుగా ఉన్నారనే భరోసా వారిలో కలుగుతుంది. ఇక, అన్ని విషయాలు వారు నిర్భయంగా మీతో పంచుకుంటారు.
వారి రహస్యాలను ఇతరులతో పంచుకోవద్దు..:వారు మీతో ఏదైనా రహస్యాలు పంచుకున్నట్లయితే వాటిని మీరు ఇతరులతో, ముఖ్యంగా వారి స్నేహితులు ఇరుగు పొరుగువారితో అస్సలు పంచుకోకండి. ఎందుకంటే, ఇలాంటి విషయాలు ఎవరితోనైనా పంచుకుంటే వారికి మీ మీద ఉండే నమ్మకం పోతుంది. ఇక, వారికి ఎప్పుడైనా ఏదైనా సమస్య గానీ, ఆపద గానీ వచ్చినా వారు మీతో చెప్పరు.

వారి అభిరుచులను తెలుసుకోండి..:ముందుగా వారి అభిరుచులను తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇది వారితో సమయం గడపడానికి కూడా మీకు అవకాశం ఇస్తుంది. వారి ఇష్టాలు, అయిష్టాలను తెలుసుకోండి. ఇది మీ బంధాన్ని బలోపేతం చేయడానికి ఎంతో సహాయపడుతుంది. ఈ డాటర్స్ డే నాటి నుండి వీటిని పాటిస్తే అమ్మాయిలు అన్ని విషయాలను మీతో పంచుకుంటారు.












Click it and Unblock the Notifications