వెహికల్ ఇన్సూరెన్స్ లో భారీ మార్పులు: ఇకపై.. !!

సొంత కార్లు, ద్విచక్ర వాహనాలు వినియోగించే కోట్లాది మంది వాహనదారుల ఇన్సూరెన్స్ నిబంధనల్లో కీలక మార్పులు రాబోతోన్నాయి. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేస్తోంది. మోటార్ ఇన్సూరెన్స్ విధానాన్ని మరింత పారదర్శకంగా, వాహనదారులకు మరింతఅనుకూలంగా మర్చేలా డిసెంబర్ 15 నుంచి నాలుగంచెల నూతన వ్యవస్థను అమలులోకి తీసుకుని రానుంది. వాహనదారుల అవసరాలకు తగ్గట్టుగా పాలసీలను వర్గీకరించి అందించడమే దీని ప్రధాన ఉద్దేశం.

డిసెంబర్ 15 తర్వాత జారీ అయ్యే ప్రైవేట్ కార్లు, ద్విచక్ర వాహనాల నూతన ఇన్సూరెన్స్ పాలసీలతో పాటు రెన్యూవల్స్‌కు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. దీని ప్రకారం.. సాధారణ బీమా కంపెనీలు తమ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలను నాలుగు భాగాలుగా విభజించి ప్రపోజల్ ఫామ్‌లో రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పాలసీ విధానం, క్లెయిమ్ సమయంలో వాహనదారులకు ఇబ్బందులు ఉండదని చెబుతోంది.

Motor insurance rules are going to change from December 15th with IRDAI introducing a new structure
  • ఈ నాలుగింట్లో మొదటిది.. థర్డ్ పార్టీ లైబిలిటీ. ఎంవీ యాక్ట్ ప్రకారం ఈ బీమా కవరేజ్ తీసుకోవడం ప్రతి వాహనదారునికి తప్పనిసరి. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మూడో వ్యక్తికి కలిగే ప్రాణనష్టం, గాయాలు లేదా ఆస్తి నష్టానికి ఈ కేటగిరి కింద చట్టపరంగా పరిహారం లభిస్తుంది.
  • రెండో కేటగిరీలో.. కారులో ప్రయాణించేవారు లేదా బైక్‌పై వెనుక కూర్చునే పిలియన్ రైడర్లకు సంభవించే ప్రమాదాలకు యజమానిపై పడే భారాన్ని ఇది కవర్ చేస్తుంది. ఈ కవరేజ్ పూర్తిగా ఐచ్ఛికం. వాహన యజమాని తన అవసరాన్ని బట్టి ఎంచుకోవచ్చు.
  • మూడో విభాగం.. పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్. వాహన యజమాని లేదా డ్రైవర్ కోసం ఉద్దేశించన కేటగిరి ఇది. నిబంధనల ప్రకారం కొన్ని ప్రత్యేక మినహాయింపులు తప్ప మిగిలిన వాహనదారులకు ఇది తప్పనిసరి. ఇతర ప్రయాణికులు, పేయింగ్ డ్రైవర్లకు ఈ కవరేజ్ పొడిగించడం కూడా ఐచ్ఛికమే.
  • నాలుగో విభాగం.. ఓన్ డ్యామేజ్ కవరేజ్. అంటే ప్రమాదాలు జరిగినప్పుడు గానీ, వాహనం చోరీకి గురైనప్పుడు గానీ, మంటల బారిన పడ్డా, ప్రకృతి వైపరీత్యాల వల్ల సొంత వాహనం దెబ్బతిన్నా.. దానికి సంబంధించిన నష్టాల నుంచి ఇది ఆర్థిక రక్షణ కల్పిస్తుంది.
పసిడి ధరలు పాతాళానికి- మరో మహా పతనం: 14 నెలల కనిష్టానికి
పసిడి ధరలు పాతాళానికి- మరో మహా పతనం: 14 నెలల కనిష్టానికి

ఈ నాలుగంచెల విధానం అమలులోకి వచ్చిన తర్వాత బీమా ప్రీమియం పెరుగుతుందా, తగ్గుతుందా అనే అంశంపై ఐఆర్‌డీఏఐ ఎలాంటి స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. పరిస్థితులను బట్టి ఓన్ డ్యామేజ్ ఉత్పత్తుల ధరలను స్వయంగా నిర్ణయించుకునే వెసులుబాటును బీమా కంపెనీలకే ఇచ్చింది. డిసెంబర్ 15 గడువు నాటికి దేశంలోని అన్ని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు తమ మోటార్ పాలసీలను డిజిటల్ ప్లాట్‌ఫామ్ బీమా సుగమ్ తో అనుసంధానించడం తప్పనిసరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+