జయలలితపై 'అమ్మ' సినిమా: క్లైమాక్స్ మార్పు
ముంబై: జయలలిత జీవితం ఆధారంగా నిర్మితమవుతున్న అమ్మ సినిమా క్లైమాక్స్ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కన్నడ క్వీన్ రాగిణి ద్వివేది టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమా బహు భాషల్లో నిర్మితమవుతోంది. రాగిణి ద్వివేది అన్నాడియంకె అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్రను పోషిస్తున్నారు.
కోర్టు తీర్పు నేపథ్యంలో జయలలిత రాజకీయ జీవితంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా అమ్మ సినిమా క్లైమాక్స్ మారే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాకు ఫైసల్ సైఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. హిందీ, కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా నిర్మితమవుతోంది.

తమిళ, హిందీ ద్విభాషా సినిమా మై హూఁ రజనీకాంత్‌తో ఫైసల్ సైఫ్ వెలుగులోకి వచ్చారు. కొన్ని భాగాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రజనీకాంత్ కోర్టుకు ఎక్కారు. దాంతో కోర్టు ఆ సినిమా విడుదలపై తాత్కాలిక స్టే విధించింది.
జయలలితకు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, వంద కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పిన తర్వాత తన అమ్మ సినిమా క్లైమాక్స్‌ను మార్చడంలో ఫైసల్ బిజీగా ఉన్నారు.












Click it and Unblock the Notifications