సలార్ కొంప ముంచుతున్న ఉగ్రం ఫ్యాన్స్, ట్రైలర్, డైలాగ్ లు అవే అంటూ ప్రచారం, ప్రభాస్ ఫ్యాన్స్ ?

భారత సినీ చరిత్రలో భారీ అంచనాలు క్రియేట్ చేసిన సినిమా సలార్ ట్రైలర్ విడుదలైంది. సలార్ సినిమా ట్రైలర్ కోసం ఇంతకాలం డార్లింగ్ అభిమానులు ఎదురు చూశారు. బాహుబలి, బాహుబలి 2 తర్వాత ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయిన ప్రభాస్ ఇప్పుడు మాస్ అవతారంలో సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కేజీఎఫ్. కేజీఎఫ్ చాప్టర్ 2 సిరీస్ చిత్రాలతో ఘనవిజయం సాధించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ చిత్రానికి దర్శకత్వం వహించడంతో సలార్ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

శుక్రవారం రాత్రి సలార్ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. విడుదలైన 15 నిమిషాల్లోనే ఈ ట్రైలర్‌కు 17 లక్షకు పైగా వ్యూవ్స్, లక్షకు పైగా లైక్స్ రావడంతో ప్రభాస్ అభిమానులు గాల్లో తేలిపోతున్నారు. సలార్ సినిమా ట్రైలర్ చూసిన ప్రభాస్ అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నారు. ట్రైలర్ చూస్తుంటే మేకర్స్ సలార్ కోసం భారీగా ఖర్చు పెట్టారని స్పష్టంగా తెలుస్తుంది. సలార్ సినిమాలో పృథ్వీరాజ్, ప్రభాస్ స్నేహితులుగా కనిపిస్తారు.

Movie fans say that there are many similarities between Salar movie trailer and Ugram Kannada movie

అద్భుతమైన సెట్లు, యాక్షన్ సన్నివేశాలు సలార్ సినిమా ట్రైలర్ లో ప్రభాస్ అభిమానులను ఆకట్టుకున్నాయి. సలార్ సినిమాతో ప్రభాస్‌కి భారీ విజయాన్ని అందించాలని ఆయన అభిమానులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు. సలార్ ట్రైలర్ అదిరిపోయిందని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సలార్ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఆ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కళ్లకు కాయలు కాచేలా ఇంతకాలం ఎదురు చూశారు. డిసెంబర్ 22వ తేదీస సలార్ విడుదల చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగుతో పాటు ఐదు బాషల్లో లార్ సినిమా విడుదల అవుతోంది.

ప్రభాస్, కన్నడ దర్శకుడు, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ సినిమా షూటింగ్ మొదలు అయినప్పటి నుంచి ఉన్న క్యూరియాసిటీ ఏంటంటే ఇది కన్నడ ఉగ్రం సినిమాకు రీమేక్ అని. కన్నడ ఉగ్రం సినిమాతోనే ప్రశాంత్ నీల్ దర్శకుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఉగ్రం సినిమాలో కన్నడ హీరో మురళి, తిలక్ స్నేహితులుగా నటించారు. అద్భుతమైన యాక్షన్, మాస్ డైలాగ్‌లతో ఉగ్రం సినిమా అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించింది.

Movie fans say that there are many similarities between Salar movie trailer and Ugram Kannada movie

స్యాండిల్ వుడ్ చిత్రపరిశ్రమలో ఉగ్రం సినిమా కొత్త ఒరవడిని సృష్టించి భారీ విజయాన్ని అందుకుంది.ఇప్పుడు సలార్ సినిమా చూసిన కన్నడిగులు మాకు ఉగ్రం సినిమా గుర్తొస్తోందని అంటున్నారు. ఉగ్రం, సలార్ సినిమాల రెండు కథలు దాదాపుగా ఒకటే కావడమే అందుకు కారణం అని ఉగ్రం సినిమా చూసిన సినీ అభిమానులు అంటున్నారు. కానీ ఉగ్రం సినిమా వేరు అని, సలార్ భారీ బడ్జెట్‌తో రూపొందుతోందని. ఉగ్రం కథను కొద్దిగా మార్చారని ఉగ్రం సినిమా చూసిన అభిమానులు అంటున్నారు. సలార్ ట్రైలర్ చూస్తే ఇది ఉగ్రం కథలా అనిపించదని కొందరు అంటున్నారు.

ప్రభాస్ సలార్ ట్రైలర్ చూసిన కన్నడిగులు ఎక్కడో ఈ డైలాగులు విన్నట్లు అనిపిస్తుంది అని అంటున్నారు. కన్నడలో విడుదలైన ప్రశాంత్ నీల్ ఫేవరెట్ మూవీ ఉగ్రం సినిమా లక్షణాలు సలార్ ట్రైలర్ లో కనిపిస్తోందని కొందరు అంటున్నారు. అయితే ఉగ్ర‌ంలో అంత వ‌య‌లెన్స్ లేద‌ని, సలార్ లో క‌థ‌ని మార్చేశారని కొందరు అంటున్నారు. అయితే సలార్ సినిమా కూడా ఇద్దరు స్నేహితుల కథే అని అంటున్నారు.

కన్నడ హీరో శ్రీ మురళికి కొత్త ఖ్యాతిని తెచ్చిపెట్టిన ఉగ్రం సినిమా అప్పట్లో స్యాండిల్ వుడ్ లో భారీ కలెక్షలు సాధించింది. ఉగ్రం సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఉగ్రం కథను మార్చి సలార్ ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు గతంలో చాలా వార్తలు వచ్చాయి. ఇద్దరు మిత్రులు శత్రువులుగా మారడమే సలార్ కథ అని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే పలు సందర్బాల్లో చెప్పారు.

Movie fans say that there are many similarities between Salar movie trailer and Ugram Kannada movie

కొంతమంది అభిమానులు సలార్ సినిమాలో కేజీఎఫ్ హీరో యశ్ ఉన్నాడని, కేజీఎఫ్-2కు సలార్ కు సంబంధం ఉందని, ఇది ప్రశాంత్ నీల్ యూనివర్స్ అని చెబుతున్నారు. అయితే కేజీఎఫ్‌కి సలార్ కు ఎలాంటి సంబంధం లేదని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో సలార్ రెండు భాగాలుగా రావడం, కేజీఎఫ్ కు సంబంధం ఉండకపోవడం ఖాయం అని తెలిసింది.

సలార్ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 22వ తేదీన సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ నటిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ ను బెంగళూరుకు చెందిన హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. గతంలో కేజీఎఫ్, కేజీఎఫ్ 2, కాంతార సినిమాలతో పాటు అనేక కన్నడ సినిమాలు ఇదే బ్యానర్ లో నిర్మించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+