యూపీలో "బుల్డోజర్" దుమారం.. అఖిలేష్ - నేటి ఔరంగజేబు : శివారాజ్ సింగ్ చౌహాన్ కౌంటర్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. మొత్తం ఏడు దశల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా ఇప్పటికే మూడు విడతలు ముగిశారు. నాలుగో దశ ఎన్నికల ప్రచారాన్ని నేతలు సభలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. అధికార బీజేపీ వర్సెస్ సమాజ్ వాదీ పార్టీ అన్న విధంగా నేతల విమర్శలు, ప్రతివిమర్శలు తారాస్థాయికి చేరాయి.

తండ్రికే విధేయుడిగా లేని వ్యక్తి..
యూపీలోని డియెరియాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈసందర్భంగా సమాజ్ వాదీ పార్టీ అధినేత , మాజీ సీఎం అఖిలేష్‌యాదవ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన తండ్రి ములాయం సింగ్ యాదవద్‌కే విధేయుడిగా లేని వ్యక్తి . అలాంటిది రాష్ట్ర ప్రజలకు ఎలా విధేయుడిగా ఉంటారని ప్రశ్నించారు. అఖిలేష్ యాదవ్ నేటి ఔరంగజేబు అంటూ విమర్శించారు.

నేటి ఔరంగ జేబు అఖిలేష్
నాటి ఔరంగ జేబు తన తండ్రిని జైలులో పెట్టాడు. వారి సోదరులను చంపాడని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. అలాగే నేటి ఔరంగ జేబుగా అఖిలేష్ వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అఖిలేష్ అవమానించినంతగా మరెవరూ అవమానపరచలేదని స్వయంగా ములాయం సింగ్ యాదవ్ తన కొడుకు గురించి చెప్పారని పేర్కొన్నారు. ఇంతటి దుర్మార్గుల చేతిలో రాష్ట్రాన్ని అప్పజెప్పితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలే అర్థం చేసుకోవాలన్నారు.

బాబాకు అర్థం ఇదే..
యూపీ సీఎం యోగిని బుల్డోజర్ బాబాగా పేరు పెట్టిన అఖిలేష్ యాదవ్‌కు శివరాజ్ సింగ్ చౌహాన్ కౌంటర్ ఇచ్చారు. బాబా అంటే తనదైన శైలిలో భావార్థాన్ని వివరిస్తూ చురకలంటించారు. బీ అంటే మాఫియాను అణిచే దైర్యవంతుడు.. ఏ అంటే ఎల్లప్పుడూ ప్రజల కోసం పనిచేయవాడు. మరొక బీ అంటే తెలివైన వాడు తక్షణ నిర్ణయాలు తీసుకునే వ్యక్తి. అదేవిదంగా ఏ అంటే ప్రజల పట్ల శ్రద్ధగల వారు .. ఈ లక్షణాలన్నీ కలవారే యోగి ఆదిత్యనాథ్ అని పేర్కొన్నారు. బుల్డోజర్లతో అవినీతి పరుల భరతం పడతారని శివరాజ్ సింగ్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications