వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

24 గంటల్లో దాక్కున్న బయటికి రాకుంటే..?: తబ్లీఘీలకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

భోపాల్: ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్‌లో పాల్గొని రాష్ట్రంలోకి వచ్చిన వ్యక్తులు వెంటనే ప్రభుత్వ అధికారుల వద్ద రిపోర్టు చేయాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. బయటకు రాకుండా దాక్కున్న తబ్లీఘీలు 24 గంటల్లో రిపోర్టు చేయకపోతే కఠినమైన క్రిమినల్ కేసులను ఎదుర్కొవాల్సిన వస్తుందని హెచ్చరించారు.

తబ్లీఘీతో భారీగా పెరిగిన కేసులు

తబ్లీఘీతో భారీగా పెరిగిన కేసులు


మార్చి నెలలో ఢిల్లీలో తబ్లీఘీ జమాత్ మత సమ్మేళనం జరిగిన విషయం తెలిసిందే. కరోనావైరస్ సోకిన విదేశీయులు కూడా ఇందులో పాల్గొనడంతో వారి ద్వారా కరోనా ఇతరులకు వ్యాపించింది. ఈ సమ్మేళనంలో పాల్గొన్నవారంతా దేశంలోని పలు రాష్ట్రాలకు వెళ్లడంతోపాటు దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి.

తబ్లీఘీలకు స్ట్రాంగ్ వార్నింగ్..

తబ్లీఘీలకు స్ట్రాంగ్ వార్నింగ్..

రాష్ట్రం నుంచి నిజాముద్దీన్ మర్కజ్‌లో పాల్గొన్నవారిని ప్రభుత్వం క్వారంటైన్ కు తరలించామని, మసీదుల్లో దాక్కున్న కొందరు విదేశీయులను ప్రభుత్వం గుర్తించిందని సీఎం శివరాజ్ తెలిపారు. ఇంకా మరికొంత మంది ఎక్కడో దాక్కుని ఉన్నారు.. వారంతా కూడా 24 గంటల్లో అధికారుల వద్ద సమాచారం ఇవ్వాలని కోరారు.
ఇక అలా చేయకపోతే రాష్ట్ర, దేశ భద్రతకు ముప్పుగా పరిగణించి కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్రంగా హెచ్చరించారు. కాగా, బుదవారం నాటికి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 229 కరోనా కేసులు నమోదు కాగా, 13 మంది ప్రాణాలు కోల్పోయారు.

లాక్‌డౌన్ పొడగించే ఆలోచనలో..

లాక్‌డౌన్ పొడగించే ఆలోచనలో..

ఇది ఇలావుండగా, కరోనావైరస్ వ్యాప్తి రాష్ట్రంలో తగ్గకపోవడంతో లాక్‌డౌన్‌ను పొడగించే ఆలోచనను చేస్తోంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. ఇదే బాటలో మరిన్ని రాష్ట్రాలు కూడా నడుస్తున్నాయి. శనివారం ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ లాక్ డౌన్ పొడగింపుపై ప్రకటన చేసే అవకాశముంది. కాగా, దేశంలో ఇప్పటి వరకు 5194కి చేరింది. మరణాల సంఖ్య 150కి చేరింది.

Recommended Video

AP Lockdown :15 New కరోనా Cases In AP,Total Cases 329

English summary
The spread of corona in the state is spreading very fast. Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan has warned that those involved in a program of Tabligi Jamaat in Nizamuddin of Delhi said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X