పోర్న్‌సైట్లతో లైంగిక నేరాలు: రద్దు చేయాలని కేంద్రానికి మంత్రి లేఖ
భోపాల్: పోర్న్ సైట్ల వల్ల లైంగిక నేరాలు పెరుగుతున్నాయని, వీటిని నిషేధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మధ్యప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి భూపేంద్రసింగ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
మైనర్లపై రేప్‌లకు పాల్పడే నిందితులకు ఉరిశిక్షను మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు.ఈ విషయాన్ని మంత్రి భూపేంద్రసింగ్ ఆ లేఖలో ప్రస్తావించారు. తమ ప్రభుత్వం గత ఏడాది నవంబర్ నుండి ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిందన్నారు.ఇదే తరహ చట్టాన్ని కేంద్రం ఇటీవలనే తెచ్చిందన్నారు.

బాలికలపై దాష్టీకాలకు పాల్పడేవారికి సమాజంలో జీవించే హక్కు లేదని, వారిని కచ్చితంగా ఉరి తీయాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.పోర్న్ వెబ్ సైట్లను తక్షణం నిషేధించాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు.
ఈ వెబ్ సైట్లతో ప్రభావితులైన యువకులు అత్యాచారం, లైంగిక వేధింపుల వంటి నేరాలకు పాల్పడుతున్నారని తమ అధ్యయనంలో తేలిందని ఆయన లేఖలో వెల్లడించారు. ఈ కారణంగానే తమ రాష్ట్రంలో తాము 25 పోర్న్ వెబ్ సైట్లను నిషేధించామని ఆయన తెలిపారు. సమాజంలో లైంగిక నేరాలు తగ్గించేందుకు వీలుగా పోర్న్ వెబ్ సైట్లను వెంటనే నిషేధించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications