బట్టలిప్పి, చెట్టుకు కట్టేసి.. బాలికపై రౌడీ షీటర్ దారుణం

మధ్యప్రదేశ్ బింద్ సమీపంలో ఉన్న నందనా అనే గ్రామానికి చెందిన రింకు రజావత్ అనే రౌడీషీటర్ ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడు. బాధిత అమ్మాయి పొలంలో పని చేసి ఇంటికి వెళ్తుండగా రౌడీషీటర్ ఆ అమ్మాయిని పట్టుకున్నాడు. ఆమెను నగ్నంగా చేసి చెట్టుకు కట్టేశాడు.
ఇంటికి వెళ్లి బైక్ తీసుకు వచ్చి నీ సంగతి చూస్తానంటూ అక్కడి నుండి వెళ్లాడు. అతను వచ్చేలోగా ఆమె అక్కడి నుండి తప్పించుకొని పారిపోయింది.
నేరుగా ఇంటికి వెళ్లిన ఆమె తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పింది. కొద్ది రోజుల తర్వాత వారు పోలీసులను ఆశ్రయించారు. విచారణ కోసం పోలీసులు గ్రామానికి వచ్చారు. అతడిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన గత నెల ఏప్రిల్ 24వ తేదిన జరిగింది.












Click it and Unblock the Notifications