లైంగిక దాడి కేసు: ఊపిరిపీల్చుకున్న ఎంపీ శశికళ పుష్ప ఫ్యామిలీ

అన్నాడీఎంకే పార్టీ బహిష్కరించిన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప భర్త లింగేశ్వరన్ తిలగం, వీరి కుమారుడు ప్రదీప్ రాజ మీద వారి ఇంటిలో పని చేస్తున్న భానుమతి, ఝాన్సీరాణి అనే ఇద్దరు యువతులు గత సంవత్సరం అక్టోబర

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ బహిష్కరించిన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప కుటుంబ సభ్యులపై పెట్టిన లైంగిక దాడి కేసును బుధవారం బాధితులు వాపస్ తీసుకున్నారు. రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప కుటుంబ సభ్యుల మీద భానుమతి, ఝాన్సీరాణి అనే అక్కా, చెల్లి కేసు పెట్టారు.

శికళ పుష్ప కుటుంబ షభ్యుల మీద పెట్టిన లైంగిక దాడి కేసును విత్ డ్రా చేసుకుంటున్నామని ఇద్దరు యువతులు లిఖితపూర్వకంగా జిల్లా ఎస్పీ కార్యాలయానికి లేఖ రాశారని మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు.

MP Sasikala Pushpa’s domestic maids withdraw sexual assault case against her family

శశికళ పుష్ప ఇంట్లో పని చేస్తున్న సమయంలో మా మీద లైంగిక దాడి జరిగిందని ఆరోపిస్తూ భానుమతి, ఝాన్సీరాణి అనే ఇద్దరు యువతులు 2016 అక్టోబర్ 4వ తేది తిరునల్వేలి జిల్లా తుత్తికుడి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

రాజ్యసభ సభ్వురాలు శశికళ పుష్ప, ఆమె భర్త లింగేశ్వర తిలగం, వారి కుమారుడు ప్రదీప్ రాజ్ తమ మీద లైంగిక దాడి చేశారని, శశికళ పుష్ప తల్లి గౌరీ తమను శారీరకంగా హింసించారని భానుమతి, ఝాన్సీరాణి ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు అయ్యింది.

ఈ కేసులో శశికళ పుష్ప, ఆమె తల్లి గౌరీ కోర్టులో ముందస్తు బెయిల్ తీసుకున్నారు. పోలీసులు నలుగురి మీద కేసు నమోదు చేసి విచారణ చేశారు. అయితే అనూహ్యంగా ఫిర్యాదు చేసిన ఇద్దరు యువతులు కేసు వాపస్ తీసుకోవడంతో శశికళ పుష్ప, ఆమె కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+