Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షాక్: ఆ శశికళ పోతే ఈ శశికళ వచ్చారా: ఎంత ఆశ, ఆశ్చర్యంతో నేతలు!

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి తాను పోటీ చేస్తానని ఆ పార్టీ బహిష్కరించిన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప సంచనల వ్యాఖ్యలు చేశారు.

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి తాను పోటీ చేస్తానని ఆ పార్టీ బహిష్కరించిన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప సంచనల వ్యాఖ్యలు చేశారు. శశికళ నటరాజన్ ఎంపిక చెల్లదని ఎన్నికల కమిషన్ కు మొదట ఫిర్యాదు చేసిన ఈమె ఇప్పుడు మళ్లీ తెరమీదకు వచ్చారు.

శుక్రవారం ఆమె చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికైనా శశికళ నటరాజన్, ఆమె కుటుంబ సభ్యులను అన్నాడీఎంకే పార్టీకి దూరం చెయ్యాలని మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అయితే వారిని పార్టీ నుంచి పూర్తిగా దూరం పెట్టాలని అన్నాడీఎంకేలోని రెండు వర్గాలకు సూచించారు.

MP Sasikala Pushpa said she will contest for the post of the AIADMK's general secretary

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి తాను పోటీలో ఉన్నానని శశికళ పుష్ప బాంబు పేల్చారు. మిమ్మల్ని జయలలిత పార్టీ నుంచి బహిష్కరించారు కదా అని మీడియా ప్రశ్నిస్తే నేను అంటే గిట్టనివారు అమ్మకు మాయమాటలు చెప్పడం వలనే అలా జరిగిందని శశికళ పుష్ప చెప్పారు.

అన్నాడీఎంకే పార్టీని ముందుకు నడిపించే సత్తా తనకు ఉందని శశికళ పుష్ప ధీమా వ్యక్తం చేశారు. మొత్తం మీద పన్నీర్ సెల్వం, ఎడప్పాడి పళనిసామి వర్గంతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ పడటానికి రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప కూడా సిద్దం అయ్యారు. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి తాను పోటీ చేస్తానని శశికళ పుష్ప బహిరంగంగా చెప్పడంతో ఆ పార్టీ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+