హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదీ స్వీపర్: రోడ్లు ఊడ్చేస్తున్న ‘బబ్లీ’ గర్ల్
ఆమె చేసేది స్వీపర్(రోడ్లను శుభ్రం చేసే పని) అయినా.. ఆమె తన పనికే అందాన్ని తీసుకొచ్చింది.
భోపాల్: ఆమె చేసేది స్వీపర్(రోడ్లను శుభ్రం చేసే పని) అయినా.. ఆమె తన పనికే అందాన్ని తీసుకొచ్చింది. ఆమెను చూస్తే మాత్రం ఎవరూ స్వీపర్ అని అనుకోరు.. ఎందుకంటే ఆమె హీరోయిన్‌లా ముస్తాబై విధులకు హాజరవుతుంది. అంతేగాక, స్వీపర్ అయినంత మాత్రాన అందంగా తయారవకూడదా? అని ప్రశ్నిస్తుంది ఆ 'బబ్లీ' గర్ల్. ఆమె పేరు కూడా బబ్లీనే కావడం విశేషం.

విత్ మేకప్...
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర్ ప్రాంతానికి చెందిన బబ్లీ స్థానిక మున్సిపాలిటీలో స్వీపర్‌గా పనిచేస్తోంది. ఆమె తల్లిదండ్రులది కూడా ఇదే వృత్తి. ఆమె అందరి స్వీపర్లలా కాకుడా.. రోజూ ఉదయాన్నే చక్కటి దుస్తులు, మేకప్ వేసుకుని విధులకు హాజరవుతుంది.

ఫొటోలకు పోటీ
దీంతో బబ్లీని చూసినవారంతా ఇక్కడమేమైనా సినిమా షూటింగ్ జరుగుతోందేమో అనుకునేవారట. తీరా విషయం తెలిశాక ఆమె ఫొటోలు తీసుకుని మరీ వెళుతుంటారట. దీంతో బబ్లీ ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో బాగా ఫేమస్ అయిపోయింది.

అలానే ఇష్టం
తనకు అందంగా తయారవడమంటే ఇష్టమని స్వీపర్ అయినంత మాత్రాన మంచి దుస్తులు వేసుకోకూడదన్న నిబంధనలు ఏమీ లేవని బబ్లీ చెప్పుకొచ్చింది. చాలా మంది తన ఫొటోలు తీసుకోవడంతో పాటు తనని అభినందిస్తుంటారని ఆనందపడిపోతోందీ బబ్లీ.

సోషల్ మీడియాలో హల్‌చల్
బబ్లీ.. తనలాగే రోడ్లను కూడా అందం(శుభ్రం)గా తయారు చేస్తోందని పలువురు స్థానికులు పేర్కొంటుండటం గమనార్హం. అంతేగాక, ఈ బబ్లీ గర్ల్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.












Click it and Unblock the Notifications