Cheating: పెళ్లి చేసుకుంటానని ఏకాంతంగా ?, మ్యాట్రీమోనీ పోటుగాడు అందర్, వీడి లెక్కలు రివర్స్ !

బెంగళూరు: అమాయకంగా ఉంటున్న మహిళలను లైన్ లో పెట్టి వాళ్లతో ఎంజాయ్ చేసి పెళ్లి పేరుతో మోసం చెయ్యాలని ఓ కేటుగాడు డిసైడ్ అయ్యాడు. ఇలాంటి స్కెచ్ లకు డైరెక్టుగా ఎంట్రీ ఇస్తే కష్టం అని అనుకున్న కాలాంతకుడు మ్యాట్రీమోనీ వెబ్ సైట్ లను సెలక్ట్ చేసుకున్నాడు. అనుకున్నట్లే అందమైన అమ్మాయిలకు పెళ్లి పేరుతో వల వేశాడు. పెళ్లి పేరుతో వారికి దగ్గర అయిన కిలాడి వాళ్లతో ఏకాంతంగా గడపడం మొదలు పెట్టాడు. మహిళ ఏకాంతంగా ఉన్న సమయంలో మహిళల అశ్లీల ఫోటోలు వీడియో తీసి వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు లాక్కొంటున్నాడు. వీడి దెబ్బతో మెసపోయిన ఓ మహిళ ధైర్యంగా వాడి బాగోతం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐటీ హబ్ లో మకాం వేసి మ్యాట్రీమోనీ వెబ్ సైట్ ల్లో అమాయకులైన మహిళలను టార్గెట్ చేసుకున్న కేటుగాడిని పట్టుకుని బెండ్ తీసి అసలు మ్యాటర్ బయటకు లాగుతున్నారు.

 బెంగళూరులో పోటుగాడు

బెంగళూరులో పోటుగాడు

బెంగళూరులో విజయ్ కుమార్ అలియాస్ విజయ్ అనే పోటుగాడు నివాసం ఉంటున్నాడు. వివాహం చేసుకోవాలని వారి పూర్తి సమాచారం మ్యాట్రీమోనీలో పెట్టిన మహిళల మీద విజయ్ కుమార్ కన్ను వేశాడు. అమాయకంగా ఉంటున్న మహిళలను లైన్ లో పెట్టి వాళ్లతో ఎంజాయ్ చేసి పెళ్లి పేరుతో మోసం చెయ్యాలని కేటుగాడు విజయ్ కుమార్ డిసైడ్ అయ్యాడు.

 మ్యాట్రీమోనీలో వివరాలు సేకరించాడు

మ్యాట్రీమోనీలో వివరాలు సేకరించాడు

ఇలాంటి స్కెచ్ లకు డైరెక్టుగా ఎంట్రీ ఇస్తే కష్టం అని అనుకున్న కాలాంతకుడు విజయ్ కుమార్ మ్యాట్రీమోనీ వెబ్ సైట్ లను సెలక్ట్ చేసుకున్నాడు. మ్యాట్రీమోనీలో పెళ్లి చేసుకోవాలని ఆశఫడుతున్న యువతులు, మహిళల ఫోటోలు, వారి వివరాలను విజయ్ కుమార్ సేకరించాడు. అనుకున్నట్లే విజయ్ కుమార్ కొందరు అందమైన అమ్మాయిలకు పెళ్లి పేరుతో వల వేశాడు.

 కేటుగాడి వలలో పడిపోయిన బెంగళూరు మహిళ

కేటుగాడి వలలో పడిపోయిన బెంగళూరు మహిళ

బెంగళూరులోనే నివాసం ఉంటున్న ఓ మహిళ విజయ్ కుమార్ మయమాటలు నమ్మి అతన్ని వివాహం చేసుకోవాడానికి సిద్దం అయ్యింది. విజయ్ కుమార్ ఆ మహిళతో చట్టాపట్టాలు వేసుకుని తిరిగాడు. రెండుమూడు నెలల్లో వివాహం చేసుకుందామని విజయ్ కుమార్ అమాయకురాలైన ఆమెను నమ్మించాడు.

 ఏకాంతంగా ఉన్న టైమ్ లో ఫోటోలు తీశాడు

ఏకాంతంగా ఉన్న టైమ్ లో ఫోటోలు తీశాడు

పెళ్లి పేరుతో ఆమెకు దగ్గర అయిన విజయ్ కుమార్ ఆమెతో ఏకాంతంగా గడపడం మొదలు పెట్టాడు. మహిళ ఏకాంతంగా ఉన్న సమయంలో ఆమె అశ్లీల ఫోటోలు, వీడియో తీసిన విజయ్ కుమార్ తరువాత ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. తనకు వెంటనే రూ. 50 వేలు ఇవ్వకపోతే నీ అశ్లీల ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని విజయ్ కుమార్ బ్లాక్ మెయిల్ చేశాడు.

 ఇన్ స్టాగ్రామ్ లో మూడు నకిలి అకౌంట్లు

ఇన్ స్టాగ్రామ్ లో మూడు నకిలి అకౌంట్లు

మహిళ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో విజయ్ కుమార్ రగిలిపోయాడు. అంతే మహిళ పేరుతో ఇన్ స్టాగ్రామ్ లో మూడు నకిలి అకౌంట్లు ప్రారంభించి ఆమె కుటుంబ సభ్యుల పేర్లు ట్యాగ్ చేసి ఆమె అశ్లీల ఫోటోలు పోస్టు చేశాడు. విషయం తెలుసుకున్న మహిళ హడలిపోయి విజయ్ కుమార్ అడిగిన రూ. 50 వేలు అతని చెప్పిన అకౌంట్ కు గూగుల్ పే చేసి ఆ ఫోటోలను వెంటనే డిలీట్ చెయ్యాలని అతనికి మనవి చేసింది.

Recommended Video

    World's Oldest Gymnast, 95-year-old Johanna Quaas says “Heart is Young'
     ఇంకా డబ్బులు కావాలని ఆశపడ్డాడు..... అడ్రస్ గల్లంతు

    ఇంకా డబ్బులు కావాలని ఆశపడ్డాడు..... అడ్రస్ గల్లంతు

    తాను అడిగిన రూ. 50 వేలు ఇచ్చిన మహిళ నుంచి ఇంకా డబ్బులు లాక్కోవాలని విజయ్ కుమర్ ఇంకా ఆశపడ్డాడు. తనకు మరింత డబ్బులు కావాలని విజయ్ కుమార్ ఆమెను ఇంకా ఎక్కువ టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. విజయ్ కుమార్ టార్చర్ ఎక్కువ కావడంతో బాధితరాలు బెంగళూరులోని సీఇఎస్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది, డబ్బులు తీసుకోవడానికి రావాలని మహిళతో విజయ్ కుమార్ ఫోన్ చేయించిన పోలీసులు అతన్ని పక్కాప్లాన్ తో అరెస్టు చేశారు. కేటుగాడు విజయ్ కుమార్ ఇంకా ఎంతమందిని ఇలా మోసం చేశాడు అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+