ఎంటీఎన్ఎల్ బంపర్ ఆఫర్: రోజుకు 2జీబీ, జియో కన్నా తక్కువకే..

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఎంట్రీతో టెలికాం సంస్థల నడుమ డేటా ప్యాకేజీలకు సంబంధించి తీవ్ర పోటీ నెలకొంది. పోటాపోటీగా టెలికాం సంస్థలు డేటా ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. నిన్నటితో జియో ఉచిత డేటా ఆఫర్ ప్యాకేజీ గడువు ముగియడంతో.. జియో కన్నా తక్కువ చెల్లింపులతో డేటా ఇచ్చేందుకు కొన్ని టెలికాం సంస్థలు ముందుకొస్తున్నాయి.

తాజాగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ ఎంటిఎన్ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏప్రిల్ 1నుంచి రూ.319లకే రోజుకు 2జీబీ, 3జీబీ డేటాను అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ వాలిడిటీ 28రోజుల పాటు ఉండనుంది. ఎంటీఎన్ఎల్ 31వ వార్షికోత్సవం సందర్భంగా ఖాతాదారుల కోసం ఈ ఆఫర్ ప్రకటించినట్లు సంస్థ పేర్కొంది.

MTNL takes on Reliance Jio, Bharti Airtel, to offer 2GB data per day

కాగా, ఇదే ఆఫర్ పై అన్ లిమిటెడ్ ఫోన్ కాల్ సర్వీస్ ను కూడా అందించనున్నారు. ఇతర నెట్ వర్క్ లకు 25ని. ఉచిత కాలింగ్ వర్తిస్తుంది. పరిమితి దాటితే నిమిషానికి 25పైసలు వసూలు చేస్తారు. బీఎస్ఎన్ఎల్, ఐడియా, భారతి ఎయిర్ టెల్, జియో టారిఫ్ ప్లాన్స్ తో పోల్చితే ఇదే తక్కువ ధరకు లభిస్తున్న టారిఫ్ ప్లాన్ కావడం విశేషం. అయితే ఈ ఆఫర్ కేవలం 90రోజుల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ పేర్కొనడం గమనార్హం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
State-run MTNL has joined the tariff war with its latest offer which starts from April 1.The firm will offer 2GB of 3G data per day and unlimited calling within its network for Rs 319.
Please Wait while comments are loading...