అంబానీ బీఎండబ్ల్యు కారు రిజిస్టేషన్ ఖర్చు రూ. 1.6 కోట్లు
ముంబై: శ్రీమంతులు ఏమి చేసినా వెరైటీగానే ఉంటుంది. రిలయన్స్ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ తన కారు రిజిస్టేషన్ కు ఏకంగా రూ. 1.6 కోట్లు చెల్లించారు. ముంబైలోని రవాణ శాఖ కార్యాలయంలో ముఖేష్ అంబానీ తన బీఎండబ్ల్యు కొత్త కారు రిజిస్టేషన్ చేయించుకున్నారు.
ముఖేష్ అంబానీ ఇటివల బీఎండబ్ల్యు 760 ఐ సిరీస్ కారు కొనుగోలు చేశారు. నిబంధనల ప్రకారం కారు విలువలో 20 శాతం మొత్తాన్ని రవాణా శాఖ అధికారులు రిజిస్టేషన్ ఫీజుగా వసూలు చేస్తారు. ఆ లెక్కన సుమారు రూ. 8.5 కోట్లకు పైగా ఈ బీఎండబ్ల్యు 7 సిరీస్ కారు ధర ఉందని సమాచారం.

కారు ధర ఆధారంగానే రిజిస్టేషన్ ఫీజు వసూలు చేశామని ఆర్ టీఓ శాఖ అధికారులు అంటున్నారు. ముఖేష్ అంబానీ కొనుగోలు చేసిన బీఎండబ్ల్యు కారు ధర రూ. 1.9 కోట్లు. అయితే ఆ కారుకు చాల హంగులు ఆర్బాటాలు చేయడంతో కారు ధర సుమారు రూ. 8.5 కోట్లకు పెరిగిపోయిందని సమాచారం.
జర్మనీలోని కారుకు బుల్లెట్ ప్రూఫ్, ఇతర సదుపాయాలు చేయించారు. కారు చాసీస్ తో పాటు అద్దాల మీద ఎలాంటి మారణాయుధాలతో దాడి చేసినా లోపల ఉన్న వారికి ఎలాంటి హాని కలగదు. అంబానీ కొనుగోలు చేసిన బీఎండబ్ల్యు 760 ఐ కారు ఇప్పుడు ముంబైలో హల్ చల్ చేస్తున్నది.












Click it and Unblock the Notifications