షాకింగ్: 70 కిలోలు తగ్గిన అనంత్ అంబానీ!
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రెండో కొడుకు అనంత్ అంబానీ అందర్నీ షాకింగ్‌కు గురిచేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌ల సందర్భంగా తమ ముంబై ఇండియా జట్టుతో సందడి చేసిన సమయంలో అనంత్.. భారీ ఖాయంతో దర్శనమిచ్చేవాడు.
అయితే ఇప్పుడు అనంత్ అంబానీని చూస్తే మీరు గుర్తు పట్టలేకపోవచ్చు. ఎందుకంటే.. ముందు సుమారు 140 కిలోల బరువున్న ఆయన ఇప్పుడు సగానికి తగ్గిపోయాడు. దీంతో ఆయన బరువు 70 కిలోలకు పడిపోయింది.

శనివారం గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా బక్కపలుచగా కనిపించిన అనంత్ అంబానీని చూసి అందరూ ఆశ్చార్యానికి గురయ్యారు.
కాగా, సన్నబడటం కోసం అమెరికాకు చెందిన ఓ ప్రముఖ ఫిట్ నెస్ ట్రైనర్ పర్యవేక్షణలో అనంత్ భారీ కసరత్తులు చేసినట్లు సమాచారం. అంతేగాక, జామ్ నగర్‌లోని రిలయన్స్ రిఫైనరీలో అనంత్ పలుమార్లు మారథాన్ రన్నింగ్ కూడా చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications