ముఖేష్ ఆస్తి ఓ దేశ జిడిపితో సమానం, వీరి ఆస్తితో 18సార్లు ఒలింపిక్స్ నిర్వహించవచ్చు
ముంబై: దేశంలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ మరో ఘనత సాధించాడు. ముఖేష్ వరుసగా తొమ్మిదో ఏడాది దేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో తొలి స్థానంలో నిలిచాడు. ఆయన సంపద ఏకంగా ఓ దేశ జీడీపీతో సమానం కావడం గమనార్హం.
22.7 బిలియన్ డాలర్ల (రూ.లక్షన్నర కోట్లు)తో ఆయన ఈస్టోనియా జిడిపితో సమానమైన సంపద కలిగి ఉన్నారని ఫోర్బ్స్ వెల్లడించింది. ఈస్టోనియా ఉత్తర యూరోప్‌లోని దేశం.
ఫోర్బ్స్ లెక్కల ప్రకారం ముఖేష్ అంబానీ ఆస్తి విలువ 22.7 బిలియన్ డాలర్లు. రెండోస్థానంలో ఉన్న సన్‌ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ ఆస్తి 16.9బిలియన్ డాలర్లు. మూడో స్థానంలో ఉన్న హిందుజా కుటుంబానిది 15.2బిలియన్ డాలర్లు.

నాలుగో సంపన్న వ్యక్తి అజీం ప్రేమ్‌జీ. ఆయన ఆస్తి 15బిలియన్ డాలర్లు ఇది మొజాంబిక్ దేశ స్థూల జాతీయోత్పత్తితో సమానం. 13.90 బిలియన్ డాలర్ల ఆస్తితో పల్లోంజీ మిస్త్రీ అయిదో స్థానంలో నిలిచారు.
మన దేశంలోని తొలి ఐదుగురు సంపన్నుల ఆస్తి మొత్తం కలిపితే 1,230సార్లు మంగళ్‌యాన్ చేసి రావచ్చు.
తొలి అయిదుగురి ఆస్తులు కలిస్తే అది 83.7 బిలియన్ డాలర్లు. మన డబ్బుల్లో అయితే రూ.5.59 లక్షల కోట్లు. వీరి వద్ద ఉన్న మొత్తంతో 18సార్లు రియో ఒలింపిక్స్ నిర్వహించవచ్చునని ఫోర్బ్స్ పత్రిక తెలిపింది. టాప్ వందమంది భారతీయులతో కూడిన జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది.
ఈ జాబితాలో చోటు సంపాదించేందుకు కనీస సంపద 1.25 బిలియన్ డాలర్లను కటాఫ్‌గా నిర్ణయించింది. ఇధి గత ఏడాది 1.1 బిలియన్ డాలర్లుగా ఉంది. 2015లో టాప్ 10లో నిలిచిన కుబేరులే ఈ ఏడాది కూడా అటు ఇటు మార్పులతో నిలిచారు.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications