ముకేష్ అంబానీ మరో రికార్డు: లీ కా షింగ్‌ను దాటేసి, ఆసియాలోనే నెం.2
భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ మరో రికార్డు సృష్టించారు. హాంకాంగ్ వ్యాపార దిగ్గజం లీ కా షింగ్‌ను అధిగమించి.. ఆసియాలోనే రెండో అత్యంత సంపన్నుడిగా నిలిచారు.
ముంబై: భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ మరో రికార్డు సృష్టించారు. హాంకాంగ్ వ్యాపార దిగ్గజం లీ కా షింగ్‌ను అధిగమించి.. ఆసియాలోనే రెండో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. అంబానీ కంపెనీకి ఈ ఏడాది మరో 12.1 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.77,000కోట్లు చేకూరినట్లు బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ ఇండరెక్స్ రిపోర్టు పేర్కొంది.
ఆయిల్ నుంచి టెలికాం వరకు ముకేష్ నిర్వహిస్తున్న కంపెనీల షేర్లు మార్కెట్లో రికార్డులు సృష్టిస్తుండటంతో ఆయన సంపద ఈ మేరకు పెరిగినట్లు బ్లామ్‌బర్గ్ వెల్లడించింది. కాగా, అంబానీ ఇటీవలే '0'ధరకే మొబైల్ అంటూ మొబైల్ మార్కెట్లో జియో ఫోన్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఫోన్లు త్వరలోనే అందుబాటులోకి రానుంది.

కాగా, గత సెప్టెంబర్‌లో లాంచ్ చేసిన టెలికాం బిజినెస్‌ల నుంచి ఇంకా ఆయన, ఆయన కంపెనీ షేర్ హోల్డర్స్ లాభాలను ఆర్జించాల్సి ఉంది. 2012 మార్చి నుంచి గ్రూప్ రుణాలు మూడింతలు అయినట్లు కూడా తెలిపింది. అయితే, 90శాతం రెవెన్యూలు రిఫైనింగ్, పెట్రోకెమికల్ యూనిట్లు, రిటైల్, మీడియా, ఎనర్జీ నుంచి వస్తుండటంతో రిలయన్స్ అధినేత తన సంపదను భారీగా పెంచుకుంటున్నారు.
అయితే, పెరుగుతున్న రుణాలపై మాత్రం స్పందించడానికి రిలయన్స్ అధికార ప్రతినిధి నిరాకరించారు. 2016లో బ్లూమ్‌బర్గ్ బిలీనియర్ ఇండెక్స్‌లో 29వ స్థానంలో ఉన్న ముకేష్ అంబానీ ప్రస్తుతం 34.8 బిలియన్ల డాలర్లతో 19వ స్థానానికి ఎగబాకారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications