భారత కుబేరుల జాబితా విడుదల: దేశంలో యంగెస్ట్ బిలియనీర్ ఎవరంటే?
Hurun Rich List 2025 : M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 విడుదలైంది. ఈ జాబితాలో చేర్చబడిన బిలియనీర్ల మొత్తం సంపద రూ.167 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది ఇండియూ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో దాదాపు సగం కావడం విశేషం. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ మరోసారి నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు.
బిలియనీర్ల హబ్‌గా భారత్
బిలియనీర్ల సంఖ్య పెరుగుదల: భారత్ ఇప్పుడు బిలియనీర్లకు కొత్త హబ్‌గా మారుతోంది. ఈ తాజా జాబితా ప్రకారం.. భారతీయ బిలియనీర్ల సంఖ్య 350కి పైగా పెరిగింది. భారతీయ బిలియనీర్ల సంఖ్య గత 13 ఏళ్లలో ఆరు రెట్లు పెరిగింది.

దేశంలో టాప్-3 సంపన్నులు వీరే..
హురున్ ఇండియా రిచ్ లిస్ట్-2025 ప్రకారం.. దేశంలో అత్యంత ధనవంతులు వీరే:
ముఖేష్ అంబానీ & ఫ్యామిలీ: రూ.9.55 లక్షల కోట్ల నికర విలువతో ఇండియాలో అత్యంత ధనవంతుడిగా మరోసారి నిలిచారు.
గౌతమ్ అదానీ & ఫ్యామిలీ: రూ.8.15 లక్షల కోట్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు.
రోషిణి నాడార్ మల్హోత్రా: రూ.2.84 లక్షల కోట్ల సంపదతో మూడో స్థానంలో నిలిచారు. ఈమె చరిత్రలో టాప్-3లో స్థానం సంపాదించిన మొట్టమొదటి అత్యంత ధనవంతురాలైన మహిళగా రికార్డు సృష్టించారు.
జాబితాలో ప్రముఖులు:
షారుఖ్ ఖాన్: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తొలిసారిగా ఈ బిలియనీర్ల క్లబ్‌లో చేరారు. ఆయన నికర సంపద రూ.12,490 కోట్లుగా అంచనా వేయబడింది.
అతి పిన్న వయస్కుడైన బిలియనీర్: 31 ఏళ్ల అరవింద్ శ్రీనివాస్ (పెర్‌ప్లెక్సిటీ వ్యవస్థాపకుడు) రూ.21,190 కోట్ల నికర విలువతో ఇండియాలో అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా నిలిచారు.
సంపదలో భారీ పెరుగుదల: నీరజ్ బజాజ్ అండ్ ఫ్యామిలీ సంపద అత్యధికంగా రూ.69,875 కోట్లు పెరిగింది. వీరి నికర విలువ ఇప్పుడు రూ.2.33 లక్షల కోట్లకు చేరుకుంది.












Click it and Unblock the Notifications