సొంతగూటికి ముకుల్ రాయ్..? ఢిల్లీ ఇంటిపై మోడీ, షా పోస్టర్లు మాయం, దీదీ వద్దకు...
ఇటీవల పార్టీ మారే సమయంలో నేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. సోషల్ మీడియా అకౌంట్ అయితే ప్రొఫైల్ పిక్‌లో పార్టీ లోగో తీసేస్తున్నారు. ఇటీవల కొందరు అలానే చేస్తున్నారు. మరికొందరు పార్టీ లోగో, నేతల ఫోటోలను ఇళ్ల పైనుంచి తొలగిస్తున్నారు. ఈ రెండో కోవలోకి వెళతారు ముకుల్ రాయ్. ఒకప్పటీ టీఎంసీ నేత మమతా బెనర్జీని ఎదురించి బీజేపీలో చేరారు. కానీ ఇప్పుడు ఆయన ఇంటిపై మోడీ, అమిత్ షా ఫోటోలు మాయమయ్యాయి. దీంతో ఏం జరుగుతుంది అనే చర్చకు దారితీసింది.

స్కాంతో.. బయటకు
బెంగాల్‌లో శారదా స్కాంలో రాయ్ పేరు రావడంతో టీఎంసీని వీడి బీజేపీలో చేరారు. కానీ ఆయన బెంగాల్‌లో బీజేపీని మరింత బలోపేతం చేశారు. మమత కోటాలో కమలానికి ఒక స్టేటస్ తీసుకొచ్చారు. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 18 సీట్లు గెలిచిందంటే అందులో రాయ్ పాత్ర కీలకం. దీనిని చూసి రాజకీయ విశ్లేషకులే నోరెళ్లబెట్టారు. అయితే బీజేపీలో రాయ్‌కి సముచిత గౌరవం లభించలేదు. ఇప్పటికీ కేంద్ర కమిటీలో సభ్యుడిగా ప్రకటించలేదు. దీంతో ఆయన కినుక వహించారని తెలుస్తోంది.

టీఎంసీ నేతలతో టచ్
అయితే బీజేపీ మాత్రం టీఎంసీ నేతలతో రాయ్ సన్నిహితంగా ఉన్నారని.. అందుకే పదవీ ఇవ్వడంలో ఆలస్యమవతోందని పేర్కొన్నారు. తిరిగి టీఎంసీలోకి వెళ్లే వ్యక్తిని కీలక పదవీ ఇచ్చేందుకు పార్టీ ధైర్యం చేస్తుందా అనేది వీరి వాదన. ఇటీవల సబ్యసాచి దత్తా ఢిల్లీ వచ్చారు. అతనిని టీఎంసీ నుంచి రాయ్ బీజేపీలోకి తీసుకొచ్చారు. వచ్చే ఏడాది జరిగే బెంగాల్ ఎన్నికలపై చర్చించాల్సిన సమయంలో.. తిరిగి కోల్ కతా వెళ్లిపోయారు.
Recommended Video

కవరింగ్..
అతను తిరిగి వచ్చిన తర్వాత ఆస్పత్రి పనిమీద వచ్చారని.. అందుకే కోసమే సడన్‌గా వచ్చారని తెలిపారు. కానీ దీంతో పార్టీ నేతలకు అనుమానం వచ్చింది. ఢిల్లీ 181 సౌత్ అవెన్యూలో గల రాయ్ ఇంటి గోడపై మోడీ, అమిత్ షా, బీజేపీ నేతల పోస్టర్లు లేవు. దీంతో అతని తిరిగి సొంతగూడు (టీఎంసీ)లోకి వెళతాడా అనే అనుమానం కలుగుతోంది.
-
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్‌లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!!












Click it and Unblock the Notifications