రెండో భార్య కొడుకు కోసమే: ములాయంపై మాయావతి

లక్నో: సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌పై బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓటమి భయంతోనే ములాయం రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అజమ్‌ఘర్, మెయిన్‌పురి లోకసభ స్థానాల నుంచి ములాయం సింగ్ యాదవ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

ఓటమి భయంతోనే నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్నారని ములాయంపై మాయావతి మండిపడ్డారు. మెయిన్‌పురిలో ములాయం సింగ్ గెలిస్తే.. అజమ్‌ఘడ్ స్థానాన్ని వదులుకుంటారని అన్నారు.

Mulayam Singh Yadav Contesting from Azamgarh to Please his Second Wife: Mayawati

మళ్లీ ఈ నియోజకవర్గం నుంచి వేరే వ్యక్తిని కాకుండా తన కుటుంబ సభ్యుడినే ములాయం పోటీకి పెడతారని మాయావతి చెప్పారు. తన రెండవ భార్యను బుజ్జగించడానికి.. ఆమె కుమారుడు ప్రతీక్ యాదవ్‌కు అజమ్‌ఘడ్ సీటును కట్టబెట్టేందుకు ములాయం సింగ్ యాదవ్ ప్రయత్నిస్తున్నారని మాయావతి ఆరోపించారు.

ప్రభుత్వ యంత్రంగాన్ని అధికారంలో కొనసాగుతున్న సమాజ్‌వాది పార్టీ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ములాయం సింగ్ యాదవ్‌కు పిచ్చాసుపత్రిలో చికిత్స అందించాలని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+