వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

21 కోట్ల జనాభా, రేప్‌లు అతి తక్కువే: ములాయం

By Pratap
|
Google Oneindia TeluguNews

Mulayam Singh Yadav: UP has 21 crore people, yet lowest number of rapes in India
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో సమాజ్‌లాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ మరో వ్యాఖ్య చేశారు. ఉత్తరప్రదేశ్‌లో అతి తక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

ఉత్తరప్రదేశ్ జానాభా చాలా ఎక్కువ అని, 21 కోట్ల జనాభా ఉందని, దేశంలో ఎక్కడైనా అతి తక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయంటే అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే అని, రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి నేరాన్నీ అరికట్టలేమని ఆయన అన్నారు.

మోహన్‌లాల్‌గంజ్‌లో ఘోరమైన సామూహిక అత్యాచారం, హత్య వెలుగు చూసిన నేపథ్యంలో ములాయం సింగ్ ఆ విధంగా మాట్లాడారు. మరో ఎస్పీ నేత నరేష్ అగర్వాల్ ములాయం సింగ్ వ్యాఖ్యలను సమర్థించారు.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నేరాలు జరగని రాష్ట్రం ఏదీ లేదని ఆయన అన్నారు. మూలంయ సింగ్ చెప్పింది పునాది స్థాయి వాస్తవమని ఆయన అన్నారు. లక్నో కేసు విషయానికి వస్తే మహిళ తనకు తెలిసిన వ్యక్తితో వెళ్లిందని, ఆ తర్వాత ఆమెపై దాడి జరిగిందని, నిందితుడిని గుర్తింపు జరిగిందని, అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

అత్యాచారాలు మాత్రమే కాదు చాలా నేరాలు జరుగుతున్నాయని, ఏ ప్రభుత్వం కూడా అన్నింటినీ ఒకసారిగా నిరోధించలేదని ఆయన అన్నారు. ఏ పార్టీ పాలిస్తుందనేదానితో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రంలోనూ నేరాలు జరుగుతూనే ఉన్నాయని ఆయన అన్నారు.

అత్యాచారాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే జరగడం లేదని, దేశమంతా జరుగుతున్నాయని నరేష్ అగర్వాల్ అన్నారు. బెంగళూర్‌లో ఏం జరిగిందో చూడండి, ఇది భారతదేశం ధోరణిగా మారిందని, ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన అన్నారు.

English summary

 Amidst widespread condemnation of rising crimes against women in Uttar Pradesh (UP), Samajawadi Party (SP) chief Mulayam Singh Yadav on Saturday said that the least number of rapes takes place in UP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X