ఫేస్‌బుక్: వేధింపులు తాళలేక మైనర్ ఆత్మహత్య

Facebook
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో ఫేస్‌బుక్‌లో ఓ వ్యక్తి వేధింపులు వల్ల 14 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మంగళవారం రాత్రి కాండీవలి ప్రాంతంలో చోటు చేసుకుంది. వేధింపులకు పాల్పడిన నిందితుడైన మైనర్ బాలుడిని అరెస్ట్ చేసినట్లు కాండీవలి పోలీసులు తెలిపారు. ఐపిసి సెక్షన్ 305 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.

అయితే తమ కూతురును వేధిస్తున్నట్లు పోలీసులకు ముందే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, దాంతో తమ కూతురును కోల్పోయామని బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ముందే చర్యలు తీసుకుని ఉంటే తమ కూతురు జీవించి ఉండేదని వారు వాపోయారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు పట్ల స్థానికపోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు రుజువైతే చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ముంబైలోని కాండీవలి ప్రాంతానికి చెందిన 9వ తరగతి చదువుతున్న 14ఏళ్ల బాలిక తన గదిలో మంగళవారం రాత్రి ఉరివేసుకుని కనిపించిందని తెలిపారు. అయితే బాలిక తన గదిలో ఉండి చదువుకుంటుందోని భావించామని బాలిక తల్లి పోలీసులకు తెలిపింది. సాయంత్రం 6గంటల నుంచి తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చి బద్దలు కొట్టి చూసే సరికి తన కూతురు ఉరివేసుకుని ఉందని బాలిక తల్లి పేర్కొంది.

గత కొంత కాలం నుంచి 16ఏళ్ళ ఒక మైనర్ బాలుడు తన కూతురు ఫేస్‌బుక్ అకౌంట్‌కు అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నాడని బాలిక తండ్రి ఆరోపించాడు. నాలుగు రోజుల క్రితం తన కూతురుతో కలిసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని ఆయన చెప్పారు. మంగళవారం కూడా తన కూతురుకు నిందితుడు అసభ్యకరమైన సందేశాలు పంపించడంతో అవమానకరంగా భావించిన తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+