సినిమాలో హీరోయిన్ వేషం ఇస్తామని ఆశపెట్టి నటి మీద గ్యాంగ్ రేప్
బెంగళూరు: సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తామని టీవీ నటి మీద సామూహిక అత్యాచారం చేసిన సంఘటన బెంగళూరులో జరిగింది. యువతి మీద అత్యాచారం చేసిన ఇద్దరు కామాంధులను అరెస్టు చెయ్యడానికి ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని డీసీపీ రోహిణి సపెట్ అన్నారు.
ముంబైకి చెందిన టీవీ నటి (22) కన్నడ సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపించింది. కన్నడ సినిమాలలో చాన్స్ సంపాదించడానికి బెంగళూరు వచ్చింది. విషయం పసిగట్టిన ఇద్దరు ఆమెను కలిశారు. తాము కన్నడ సినిమా నిర్మాతలమని పరిచయం చేసుకున్నారు.
తాము కొత్తగా నిర్మిస్తున్న చిత్రాలలో నీవే హీరోయిన్ అని నమ్మించారు. సినిమా విషయంపై చర్చించడానికి రావాలని చెప్పి ఆమెను కోరమంగలలోని ఒక ఇంటికి తీసుకు వెళ్లారు. తరువాత ఆమెకు కూల్ డ్రింక్ లో మత్తు పానీయం కలిపి ఇచ్చారు.

మత్తులో ఉన్న ఆమె మీద ఇద్దరు సామూహిక అత్యాచారం చేశారు. తరువాత తేరుకున్న ఆమెను ఇద్దరు బెదిరించారు. ఈ విషయం బయటకు చెబితే ఇంటర్నెట్ లో ఈ చిత్రాలను అప్ లోడ్ చేసి నీకు టీవీలు, సినిమాలలో చాన్స్ లు రాకుండా చేస్తామని బెదిరించారు.
ఆమె భయపడి ముంబై వెళ్లి అక్కడ న్యాయవాదికి విషయం చెప్పారు. న్యాయవాది సలహాతో ఆమె జాతీయ మహిళ కమీషన్ కు ఫిర్యాదు చేశారు. జాతీయ మహిళ కమీషన్ ఆదేశాల మేరకు బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో యువతి మీద అత్యాచారం చేసిన ఇద్దరు సినిమా నిర్మాతలు కాదనే విషయం వెలుగు చూసింది. నిర్మాతల ముసుగులో యువతి మీద అత్యాచారం ఇద్దరిని అరెస్టు చెయ్యడానికి పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications