Mumbai Air Pollution : దారుణంగా ముంబై వాయు కాలుష్యం-ఊపిరాడక జనం ఉక్కిరిబిక్కిరి..!
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో వాయుకాలుష్యం దారుణంగా మారిపోయింది. గత మూడునెలలుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న గాలి నాణ్యత ఇప్పుడు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోలేని స్ధాయికి చేరింది.
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో జనాలకు ఇప్పుడు ఊపిరాడటం లేదు. గాలి కాలుష్యం ఊహించనంత స్ధాయికి చేరుకోవడంతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గత మూడు నెలలుగా కాలుష్యం క్రమంగా పెరుగుతున్నా, గాలి నాణ్యత తగ్గుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో అది కాస్తా పతాకస్ధాయికి చేరిపోయింది.
ముంబైలో గాలి నాణ్యత ఎన్నడూ లేనంత దారుణ స్దాయికి పడిపోవడంతో జనం తీవ్ర శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ముంబై నగరంలో ఇప్పుడు జనం జలుబు, తలనొప్పి, గొంతు ఇన్ఫెక్షన్, పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. మానవ ఆరోగ్యంపై ఈ సమస్యలు దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయని డాక్టర్లు చెబుతున్నారు. తాజా పరిణామాలతో ఆస్పత్రులకు జనం క్యూ కడుతున్నారు.

శ్వాస సమస్యలతో ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య గత వారం రోజుల్లోనే రెట్టింపైంది. వాస్తవానికి చలికాలంలో దేశంలోని ఉత్తరాది నగరాల్లో ధూళి, పొగ పెరుగుతుంది. ఇప్పుడు నిర్మాణాలు, బహుళ అంతస్ధుల ప్రాజెక్టులు ముంబై నగరంలో పారిశ్రామిక కాలుష్యానికి తోడయ్యాయి. ముంబైలోని ఆస్పత్రుల్లో ప్రస్తుతం దాదాపు 25-30% మంది రోగులు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధుల కారణంగా ఆసుపత్రుల ఐసీయూల్లోనే ఉన్నారు. రెండేళ్ల క్రితం కరోనాతో తీవ్రంగా ఇబ్బందిపడిన నగరాల్లో ముంబై కూడా ఒకటి. ఆ తర్వాత ఈ స్ధాయిలో జనం శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతుండటం ఇదే ప్రథమంగా చెప్తున్నారు.












Click it and Unblock the Notifications