ముంబై ఎయిర్ పోర్టులో నో కరెంట్, నో ఇంటర్నెట్.. ఏం జరుగుతోంది..?
ముంబై ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా సంస్థ పేర్కొంది. ముంబై ఎయిర్ పోర్టులో డేటా నెట్ వర్క్ సమస్య ఏర్పడినట్లు తెలిపింది. అయితే ఈ సమస్యను పరిష్కరించినట్లు పేర్కొంది. కానీ కొన్ని విమానాలు కొంత ఆలస్యంగా ప్రయాణించే అవకాశం ఉందని తెలిపింది. సమస్య ఇప్పుడే సద్ధుమణిగిందని.. కుదురుకోవడానికి కొంత సమయం పడుతుందని తెలిపింది. ఈ మేరకు అనేక ఎయిర్ లైన్స్ సంస్థలు తమ ప్రయాణికులు అడ్వైజరీ జారీ చేశాయి.
@CSMIA_Official No Electricity or No Internet at Mumbai Airport. Experience this for the first time ever in my flying time. pic.twitter.com/Dc3hFCY0gh
— Jogi The Traveller (@5482294d67b84b1) August 9, 2025
ఇటీవలి కాలంలో దేశంలో విమాన ప్రమాదాలు, సాంకేతిక సమస్యలు అధికంగా జరుగుతున్నాయి. ఇటీవల గుజరాత్ అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఉత్తరాఖండ్ లో ఓ విమానం కూలి ఏడుగురు భక్తులు మరణించారు. అలాగే అనేక విమానాలు సాంకేతిక లోపం కారణంగా ఎక్కడపడితే అక్కడ ల్యాండింగ్ అయ్యాయి. మరికొన్ని ఆలస్యంగా ప్రయాణించాయి.
#TravelAdvisory
— Air India (@airindia) August 9, 2025
A third-party data network outage had impacted check-in systems at Mumbai airport, thereby delaying flight departures of airlines, including Air India. The systems have since been restored, however, some of our flights may continue to be affected for some time as…
ఈ క్రమంలో ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డేటా నెట్ వర్క్ సమస్య కారణంగా ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముంబై ఎయిర్ పోర్టులో నెట్ వర్క్ సమస్య తలెత్తినట్లు ఎయిర్ ఇండియా సంస్థ పేర్కొంది. అయితే సాంకేతిక సమస్యను పునరుద్దరించినట్లు తెలిపింది. విమానాల స్టేటస్ లను చెక్ చేసుకుని ఎయిర్ పోర్టుకు రావాలని ఈ మేరకు ఎయిర్ ఇండియా ప్రకటన విడుదల చేసింది. సమస్య ఇప్పుడే ముగిసింది .. కాబట్టి కొంత సమయం పాటు కొన్ని విమానాలు ఆలస్యం కావచ్చని తెలిపింది.

అయితే ముంబై ఎయిర్ పోర్టులో కరెంట్ సదుపాయం లేదని.. ఇంటర్నెట్ లేదని ప్రయాణికులు సామాజిక మాధ్యమమైన ఎక్స్ వేదికగా మండిపడుతున్నారు. చరిత్రలో ఇలాంటి సమస్య ఎప్పుడూ రాలేదని కామెంట్స్ చేస్తున్నారు. త్వరగా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications