ఏడవడానికి కూడా రేటు.. బిజినెస్ అంటే ఇతనిదే!

ప్రస్తుత కాలంలో ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటుండడంతో మనసు విప్పి మాట్లాడేవారు కరువయ్యారు. అది కూడా ముంబై అంటేనే ఉరుకుల పరుగుల జీవితం. సరిగ్గా ఇదే విషయాన్ని తన బిజినెస్ మోడల్‌గా మార్చుకున్నాడు పృథ్వీరాజ్ బోహ్రా అనే ఓ వ్యక్తి. ముంబై బీచ్ ఒడ్డున తన వినూత్నమైన వ్యాపారంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. బీచ్ ఒడ్డున కూర్చుని ఎదుటివారి బాధలను ఓపికగా వింటూ అందుకు డబ్బులు కూడా వసూలు చేస్తున్నాడు. కేవలం ఇతరుల బాధలను విని డబ్బులు వసూలు చేస్తున్న తీరు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఏడవడానికి కూడా రేటు పెట్టేశాడు బాబోయ్..
పృథ్వీరాజ్ బోహ్రా తన వద్దకు వచ్చేవారి సమస్య తీవ్రతలను బట్టి మూడు రకాల ప్యాకేజీలను ప్రకటించాడు. చిన్న సమస్యలైతే వారి వద్ద నుంచి రూ.250 వసూలు చేస్తున్నాడు. కాస్త సీరియస్ విషయాలైతే రూ.500.. లేదంటే కలిసి కూర్చుని ఏడవాలంటే రూ. 1000లను వసూలు చేస్తున్నాడు. ఎవరైనా తమ బాధను పంచుకోవాలనుకంటే నేను వింటానని హిందీలో రాసి ఉన్న ప్లకార్డును పట్టుకుని బీచ్‌లో కనిపిస్తున్నాడు ఈ పృథ్వీరాజ్ బోహ్రా. అతడిని నిజంగానే ఎవరైనా తమ కష్టాలు చెప్పుకుని డబ్బులు ఇస్తారా అని అడగగా.. "అవును చాలా మంది వస్తున్నారు" అని పృథ్వీరాజ్ సమాధానిం చెప్పడం విశేషం.

Mumbai Beach Viral Video Man Charges Rs 1 000 to Listen to Problems Viral Listening Business Story

నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు."ముంబై వంటి మెట్రో నగరాల్లో ఒంటరితనం పెరిగిపోతోంది. మనల్ని జడ్జ్ చేయకుండా మన మాట వినేవారు దొరకడం కష్టమైన ఈ రోజుల్లో ఇదొక మంచి స్టార్టప్ ఐడియా" అని కొందరు ప్రశంసిస్తున్నారు. "బాధల్లో ఉన్నవారిని ఆదుకోవడం పోయి, వారి బలహీనతపై డబ్బులు సంపాదించడం ఏంటి? ఇది సరైన పద్ధతి కాదు" అని మరికొందరు మండిపడుతున్నారు.ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఓ నెటిజన్ స్పందిస్తూ.. "మా దగ్గర ఎవరి బాధలనైనా ఉచితంగా వింటాం. కానీ మెట్రో నగరాల్లో బాధను కూడా అమ్ముకుంటున్నారంటే అక్కడి సమాజం ఎంత ఒంటరితనంలో ఉందో అర్థమవుతోంది" అని కామెంట్ చేశారు.

మానసిక ఆరోగ్య నిపుణులు కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వాలిఫైడ్ కౌన్సిలర్లు కాకుండా ఇలాంటి వారు ఇచ్చే సలహాలు లేదా పద్ధతులు కొన్నిసార్లు సమస్యను మరింత క్లిష్టతరం చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా, ఈ 'లిజనింగ్ బిజినెస్' ఇప్పుడు ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+