పొలిటిషియన్ భార్యకు స్టంట్ మాస్టర్ మస్కా!
ముంబై : కేవలం రెండు లక్షలకు ఆశపడి సినీ ఇండస్ట్రీలో తనకున్న పేరుకు మచ్చ తెచ్చుకున్నాడు శంషర్ ఖాన్ అనే స్టంట్ మాస్టర్. ఈమధ్యే ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న ఇతగాడు బాలీవుడ్ లో షారుక్, అజయ్ దేవ్ గన్, అక్షయ్ కుమార్ వంటి బిగ్ హీరోలకు సైతం స్టంట్లు కంపోజ్ చేశాడు.
అయితే శంషర్ ఖాన్ (30 )కు ఓ కారు డీలరుతో ఉన్న పరిచయం కాస్త.. అతన్ని కారు దొంగగా మార్చేసింది. ఓ పొలిటీషియన్ భార్య కారును దొంగలిస్తే.. రూ.2లక్షలు ఇస్తానంటూ అభయ్ పాటిల్ అనే కారు డీలర్ ఆశపెట్టడంతో.. రెండు లక్షలకు కక్కుర్తి పడి కారును దొంగిలించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు శంషర్ ఖాన్.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ లో స్టంట్ మాస్టర్ గా పనిచేస్తోన్న శంషర్ ఖాన్ ముంబైలోని కుర్ల అనే ప్రాంతంలో ఉంటున్నాడు. శంషర్ కు చాలాకాలంగా అభయ్ పాటిల్ (42) అనే కారు డీలర్, విజయ వర్మ అనే పనిమనిషితో పరిచయం ఉంది. శంషర్ ఖాన్ ఉంటున్న ప్రాంతానికి సమీపంలోనే వెయిన్ గంగా అనే ఓ అపార్ట్ మెంట్ ఉంది. పేరు మోసిన రాజకీయ నాయకులు, బడా పారిశ్రామికవేత్తలు అందులో నివాసముంటారు.

ముంబైకి చెందిన అభా భాప్నా అనే ఓ రాజకీయ నేత భార్య కూడా ఇదే అపార్ట్ మెంట్ లో నివాసముంటోంది. ఆమె వద్ద రూ.98లక్షల విలువ చేసే ఆడి ఏ8(2008) కారు ఉంది. అయితే ఈ కారుపై కన్నేసిన అభయ్ పాటిల్, దాన్ని దొంగలించి తనకు అప్పజెప్పితే రూ.2లక్షలు ఇస్తానని శంషర్ ఖాన్ తో డీల్ ఓకె చేసుకున్నాడు.
ఒప్పందం మేరకు రంగంలోకి దిగిన శంషర్ ఖాన్.. పనిమనిషి విజయ్ వర్మ సహాయంతో కారు తాళాలు సంపాదించి కారుతో ఉడాయించాడు. అలా.. ముంబై నేవి రోడ్డు మీదుగా వెళ్తున్న అతన్ని అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు అడ్డుకుని అాదుపులోకి తీసుకున్నారు. తాళాలు శంషర్ ఖాన్ చేతిలోకి ఎలా వచ్చాయన్న దానిపై పోలీసులు ప్రస్తుతం అతన్ని ఆరా తీస్తున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications