ప్రియురాలిని మాయం చేసిన ప్రియుడు, హాలీవుడ్ సినిమా స్టైల్లో L01-501 కోడ్, మ్యాటర్!

40 రోజుల క్రితం అదృశ్యమైన 19 ఏళ్ల యువతి మృతదేహాన్ని డిసెంబర్ 12న ముంబై పోలీసులు కనుగొన్నారు. ప్రియురాలిని హత్య చేసిన ప్రేమికుడు అతను ఆత్మహత్య చేసుకునే ముందు తాను రాసిన సూసైడ్ నోట్‌లో ఆమె మృతదేహాన్ని ఎక్కడ పూడ్చిపెట్టాడో అనే విసయం ఎవ్వరూ గుర్తించకుండా హాలీవుడ్ సినిమా టైపులో కోడ్ రూపంలో రాయడం హాట్ టాపిక్ అయ్యింది.

40 రోజుల నిరంతర ప్రయత్నాల తర్వాత, పోలీసులు ఈ కోడ్‌ను డీకోడ్ చేయగలిగారు. హత్యకు గురైన యువతి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. నవీ ముంబాయిలోని ఖార్ఘర్ హిల్ అడవుల్లో వైష్ణవి బాబర్ అలియాస్ వైష్టవి (19) అనే యువతి మృతదేహం లభ్యమైందని ముంబయి పోలీసు అధికారులు తెలిపారు. 24 ఏళ్ల వైభవ్ బురుంగలే అలియాస్ వైభవ్ అనే యువకుడు అతని ప్రేమ విఫలం అయిందని కోపోద్రిక్తుడైన మాజీ ప్రియురాలు వైష్ణవిని ఖర్ఘర్ కొండల్లో గొంతుకోసి చంపాడని మహారాష్ట్రాకు చెందిన ఒక వార్తా సంస్థ తెలిపింది.

 Mumbai boyfriend who killed his college girlfriend and committed suicide

మాజీ ప్రియురాలు వైష్ణవిని హత్య చేసిన తర్వాత వైభవ్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు వైభవ్ రాసిన సూసైడ్ నోట్‌లో కోడ్ దొరికింది. ఈ కోడ్ కనుగొనబడిన తర్వాత వైష్ణవి మృతదేహాన్ని కనుగొనడానికి పోలీసు అధికారులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పోలీసులు చివరికి వైష్ణవి మృతదేహాన్ని అటవి ప్రాంతంలో వెలికితీశారు.

వైష్ణవి బాబర్ డిసెంబర్ 12వ తేదీన ఇంటి నుంచి బయలుదేరి సియోన్‌లోని తన కాలేజీకి వెళ్లింది. అయితే ఆ రోజు వైఫ్ణవి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లి అదే రోజు కలంబోలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అదే రోజు అర్దరాత్రి రైల్వే ట్రాక్ పై వైభవ్ బురుంగలే అనే వ్యక్తి మృతదేహం లభ్యమైంది. జుయినగర్‌ స్టేషన్‌ రైల్వే ట్రాక్‌పై వైభవ్ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. వైభవ్ మృతిపై కేసు నమోదు చేసి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ దశలో వైభవ్ మొబైల్‌లో వైష్ణవిని చంపి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు లభించింది.సూసైడ్ నోట్‌లో L01-501 అనే పదాలు ఉన్నాయి. దీని అర్థం పోలీసులకు తెలియలేదు. చివరగా వైష్ణవి మృతదేహాన్ని పడేసిన ప్రదేశంలో అటవీ శాఖ చెట్టుపై గుర్తించిన నంబర్‌ను పోలీసులు డీకోడ్ చేశారు.

అనంతరం పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. వైష్ణవి కనిపించకుండా పోయిన రోజున ఆమెతో పాటు వైభవ్ ఇద్దరూ కలిసి ఖార్ఘర్ కొండలో కనిపించారని పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. అనంతరం పోలీసులు, అటవీశాఖ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, సిడ్కో బృందం వైష్ణవి మృతదేహం కోసం వెతకడం ప్రారంభించారు. వైష్ణవి ఆచూకి తెలుసుకోవడాికి నిర్వహించిన 10 రోజుల సెర్చ్ ఆపరేషన్ కోసం డ్రోన్‌లను కూడా మోహరించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ నంబర్‌ ఎక్కడ ఉంది, దీని కథ ఏమిటి అంటూ పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. చివరికి పోలీసులకు ఎల్ 01-501 నంబర్ ఉండే చెట్టు అటవి ప్రాంతంలో ఉందని గుర్తించారు. ఆ నెంబర్ ఉన్న చెట్టు సమీపంలో కాలేజ్ అమ్మాయి వైష్ణవి మృతదేహం కనిపించింది. ఖార్ఘర్‌లోని ఓ క్యాంప్ ప్రాంతంలోని డంపింగ్ గ్రౌండ్‌లోని పొదల్లో వైష్ణవి మృతదేహం పడి ఉంది. కాలేజీకి వెళ్లే సమయంలో వేసుకున్న దుస్తులు, చేతి గడియారం, గుర్తింపు కార్డు ఆధారంగా వైష్ణవి మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+