బంద్‌లో హింస: ఉద్రిక్తం, బస్సులు దగ్ధం, రైళ్లకూ దెబ్బ

Posted By:
Subscribe to Oneindia Telugu
  Bhima-Koregaon incident : మహారాష్ట్ర బంద్, ఆందోళనలతో అట్టుడికిన ముంబై

  ముంబై: కోరేగావ్ - భీమా సంఘటనకు నిరసనగా దళిత సంఘాలు, నేతలు ఇచ్చిన పిలుపు మేరకు తలపెట్టిన మహారాష్ట్ర బంద్‌లో బుధవారం హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. కోరేగావ్ - భీమా సంఘటనలకు నిరసనగా బంద్ తలపెట్టిన విషయం తెలిసిందే.

  బంద్ కారణంగా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై తీవ్రమైన ప్రభావం పడింది. బెస్ట్ బస్సులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ముంబైలోని పలు ప్రాంతాల్లో మెట్రో రైళ్లను ఆపేశారు. థానేలో 144వ సెక్షన్ విధించారు. సున్నితమైన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

  ముంబై సెంట్రల్ రైల్వే, హార్బర్ లైన్లపై బంద్ ప్రభావం పడింది. కల్యాణ్, పాన్వేల్‌లకు నడిచే రైళ్లపై తీవ్రమైన ప్రభావం పడింది. బుధవారం ఉదయం 11 గంటల నుంచి రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు కూడా సరిగా నడవడం లేదు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు నిలిచిపోయారు.

  చెందని కోలివాడ ప్రాంతంలో రెండు థానే మున్సిపల్ ట్రాన్స్‌పోర్టు బస్సులు, ఆటో రిక్షా ధ్వంసమయ్యాయి. నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. అసల్పా, ఘట్కోపార్ మెట్రో స్టేషన్లలో ఆందోళనకారులు రైళ్లను ఆపేశారు. ముంబైలోని పలు దుకాణాలను బలవంతంగా మూసేయించారు.

  రాళ్లు రువ్వడంతో 13 బెస్ట్ బస్సులు ధ్వంసమయ్యాయి. బంద్రా కళానగర్, ధార్వీ కుంబర్వాడ, కామరాజ్ నగర్, సంతోష్ నగర్ దిండోషి, హనుమాన్ నగర్, కాండివాలి తదితర ప్రాంతాల్లో రాస్తారోకోలు జరిగాయి. ఔరంగాబాద్‌లో ఇంటర్నెట్ సర్వీసులను ఆపేశారు. బస్సుల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది.

  తదుపరి ఆదేశాలు అందే వరకు పూణేలోని బరామతి, సతారా ప్రాంతాలకు బస్సులు నడపవద్దని సూచించారు. పుకార్లను నమ్మవద్దని పోలీసులు కోరుతున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The bandh called by Dalit outfits across Maharashtra to protest against Pune's Koregaon-Bhima violence has severely affected the normal life on Wednesday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి