అర్ధరాత్రి పూట ఆపి: యువతికి ఆటో డ్రైవర్ వేధింపు, కాపాడిన పోలీస్

ముంబై: అర్ధరాత్రి పూట నిర్మానుష్య రోడ్డులో ఆపి, తన ఆటో ఎక్కిన యువతిని వేధించిన ఆటో డ్రైవర్‌ను ఓ పోలీసు చాకచక్యంతో పట్టుకున్నారు. తనకు ఎక్కువ డబ్పులు ఇవ్వాలని ఆటో డ్రైవర్ ఆమెను మధ్యలో ఆపి వేధించాడు. అతని తీరు ముందుగానే పసిగట్టిన పోలీసు ఆటోను వెంబడించి, ఆమెను భద్రంగా ఇంటికి పంపించేశారు.

ఈ సంఘటన ముంబైలో ఫిబ్రవరి 3వ తేదీన అర్ధరాత్రి 11.30 గంటలకు జరిగింది. మేఘనా మురళీ అనే యువతి బెంగళూరు నుండి ముంబైకి వచ్చింది. ఆమెది ముంబై. ఓ పని నిమిత్తం బెంగళూరు వెళ్లి వచ్చింది. అంధేరీలోని విమానాశ్రయం నుండి బయటకు వచ్చి ఓ ఆటో ఎక్కింది. అక్కడే ఉన్న కానిస్టేబుల్ చూశారు. అతను సహారా పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్నారు.

Mumbai: Cop Protects Woman From Abusive Auto Driver, Escorts Her Home

ఆమె ఆటో ఎక్కి వెళ్లాక ఆటో డ్రైవర్ తీరు పైన కానిస్టేబుల్‌కు అనుమానం వచ్చింది. ఆయన అనుమానించినట్లుగానే.. ఆటో డ్రైవర్ ఆమెను ఇంటికి తీసుకు వెళ్లే దారిలో నిర్మానుష్య ప్రదేశంలో ఆపాడు. తనకు ఎక్కువ డబ్బులు ఇవ్వాలని, అప్పుడే ఇంటి వద్ద దింపుతానని బ్లాక్ మెయిల్ చేశాడు.

అక్కడకు చేరుకున్న ఆ కానిస్టేబుల్ అతని వద్ద నుండి ఆటో కాగితాలు, అతని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. ఆమెను ఇంటి వద్ద భద్రంగా దింపి రావాలని ఆదేశించాడు. మరుసటి రోజు వచ్చి వాటిని తీసుకోవాలని సూచించాడు.

దీంతో ఆటో డ్రైవర్ ఆమెను భద్రంగా ఇంటి వద్ద దింపి వచ్చాడు. తనకు ఆటో డ్రైవర్ పైన అనుమానం వచ్చి ద్విచక్ర వాహనం పైన వెనుకనే వెళ్లానని కానిస్టేబుల్ చెప్పారు. కానిస్టేబుల్ చేసిన సహాయాన్ని ఆమె వివరించారు. ఆ కానిస్టేబుల్ పేరు మురళి. అతనికి రివార్డ్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+