అమానుషం: రేప్ బాధితురాలిని నించోబెట్టి పోలీసుల ఫైట్
ముంబై: ఐదేళ్ల అత్యాచార బాధితురాలిని ఆస్పత్రికి కూడా పంపించకుండా, ఆమెను నిలబెట్టి పోలీసు స్టేషన్ పరిధిలో విషయంలో ఇద్దరు పోలీసు అధికారులు పరస్పరం కయ్యానికి దిగారు. వారిద్దరినీ ముంబై పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
సంఘటన జరిగిన స్థలం తమ పరిధిలోది కాదంటే, తమ పరిధిలోది కాదంటూ ఇద్దరు తగాదా పడ్డారు. అంతోప్ హిల్ పోలీసు స్టే,న్ అసిస్టెంట్ పోలీసు ఇన్‌స్పెక్టర్ సంజీవ్ నింబాల్కర్‌ను, వాడాలా ట్రక్ టెర్మినల్ పోలీసు స్టేషన్ అసిస్టెంట్ పోలీసు ఇన్‌స్పెక్టర్ ఝావ్రేను సస్పెండ్ చేశారు.

విధులను నిర్లక్ష్యం చేసినందుకు, కఠినంగా వ్యవహరిస్తూ బాధ్యతారహితంగా ప్రవర్తించినందుకు వారిద్దరినీ సస్పెండ్ చేసినట్లు శాంతి భద్రతల జాయింట్ పోలీసు కమిషనర్ దేవేన్ భారతి చెప్పారు.
ఐదేళ్ల చిన్నారిపై గురువారం రాత్రి వాడాలా శివారులో గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం చేశాడు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అయితే, వారిని బయట గంటల తరబడి నిలబెట్టి ఆ సంఘటన ఎవరి పరిధిలోకి వస్తుందనే విషయంపై ఇరువురు అధికారులు వాదన పెట్టుకున్నారు.
రక్తమోడుతున్న బాలికను ఒక పోలీసు స్టేషన్ నుంచి మరో పోలీసు స్టేషన్‌కు తిప్పారు. చివరకు ఆస్పత్రికి పంపించారని కుటుంబ సభ్యులు మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications